నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో బయ్యర్ల ఆశలన్నీ వీకెండ్ మీద ఉన్నాయి. రాజమౌళి కుటుంబం బాగా ప్రమోట్ చేసిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ తెలుగు రాష్ట్రాల్లో డీసెంట్ ఓపెనింగ్ దక్కించుకుంది. టాక్ యునానిమస్ గా లేకపోయినా ఉన్నంతలో చిన్న పిల్లలకు మంచి ఛాయస్ అవుతుందనే అభిప్రాయం ఏ మేరకు ఉపయోగడుతుందో రెండు మూడు రోజులాగి చూడాలి.
సందీప్ కిషన్ హీరోగా జేసన్ సంజయ్ దర్శకత్వంలో రూపొందిన ‘సిగ్మా’కు ప్రారంభం పర్వాలేదనే స్థాయిలో ఉంది కానీ ఇది సరిపోదు. మిక్స్డ్ టాక్ లో ఏమైనా మార్పు వస్తే కనక క్రమంగా వసూళ్లు పెరగొచ్చు. తమిళంలో బెటర్ గా ఉన్న సిగ్మాకు తమిళ సీఎం కొడుకు మూవీ అనే స్టాంప్ బయట అంతగా ఉపయోగపడటం లేదు. ఇక చిన్న సినిమాగా వచ్చిన ‘తెల్లకాగితం’ కొంత సౌండ్ అయితే చేస్తోంది కానీ ఇది చాలదు. ఈ మూడు సినిమాలు బుక్ మై షో ట్రెండింగ్ లో ఉండటం గమనార్హం.
పరిమిత బడ్జెట్ లో వచ్చిన ‘అనకాపల్లి’ కూడా ఉనికిని చాటుకునేందుకు గట్టిగానే కష్టపడుతోంది. కన్నడలో సంచలనం సృష్టిస్తున్న డబ్బింగ్ మూవీ ‘ప్రేమనే ఊరిలో’ మన దగ్గర వీక్ ప్రమోషన్స్ వల్ల ఎదురీదుతోంది. టీమ్ ఏమైనా అలెర్ట్ అవుతుందేమో చూడాలి. ఇక బాలీవుడ్ ‘దృశ్యం 3’కి మల్టీప్లెక్స్ జనాల ఆదరణ బాగుంది. మలయాళం వెర్షన్ కి సంబంధం లేకుండా రీమేక్ చేయడంతో ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ వీకెండ్ డామినేషన్ ఖాయమే అని చెప్పొచ్చు.
కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషించిన ‘డోరతీ’కి రానా దగ్గుబాటి అండగా నిలబడ్డా పబ్లిక్ దాని వైపు టర్న్ కావడం లేదు. సెన్సిటివ్ ఇష్యూ మీద తీసిన మూవీ కావడంతో ఏ మేరకు నిలబడుతుందో చూడాలి. ఊహించని విధంగా కార్టూన్ మూవీ ‘డోరేమాన్ కాసిల్ అఫ్ అండర్ డెవిల్’కు టికెట్లు బాగా తెగుతున్నాయి. గత వారం వచ్చిన ‘ప్యారడైజ్’ మళ్ళీ పికప్ అందుకుంది భారీగా అయితే కాదు. మొత్తానికి కొత్త రిలీజుల కౌంట్ బాగుంది కానీ ఆడియన్స్ క్వాంటిటీ (ప్రేక్షకుల సంఖ్య) కూడా పెరిగితే ఇంకా బాగుంటుంది.
This post was last modified on October 3, 2026 2:49 pm
ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద…
ఏఐ దుర్వినియోగమవుతున్న తీరు చూస్తుంటే టెక్నాలజీ తాలూకు పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయా అనిపిస్తుంది. రోబోలో ఒక యంత్రం హీరోయిన్…
ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నాయి? వైసీపీకి ఎన్ని స్థానాలు…
భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…