ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం విరగబడి వచ్చేస్తున్నారు. హీరోలు, హీరోయిన్లను చూస్తే కుర్రకారు ఆగడం లేదు. ముఖ్యంగా హీరోయిన్ల చుట్టూ ఎంతమంది బౌన్సర్లు ఉన్నా సరే.. కుర్రాళ్లను కంట్రోల్ చేయడం కష్టమైపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ కొందరు హీరోయిన్లు.. జనాలకు వీలైనంత యాక్సెస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. ఓపిగ్గా ఫొటోలకు పోజులివ్వడం చేస్తుంటారు.
తాజాగా కన్నడ కథానాయిక రచిత రామ్.. అభిమానులతో ప్రేమగా వ్యవహరించగా, ఒక ఫ్యాన్ చనువు తీసుకుని చేసిన పనికి ఆమె షాకవ్వాల్సి వచ్చింది. ఒక కార్యక్రమంలో భాగంగా బారికేడ్ అవతల నిలుచుని ఉన్న రచిత రామ్.. వరుసగా అభిమానులకు సెల్ఫీలు ఇస్తుండగా, ఒక ఫ్యాన్ ఊహించని పని చేశాడు.
సెల్ఫీ దిగిన అనంతరం రచిత బుగ్గ గిల్లేసి వెళ్లిపోయాడు. అతను చేసిన పనికి ఒక్కసారిగా అవాక్కయిన రచిత.. చిన్న నవ్వు నవ్వి అతణ్ని ఏమనకుండా వదిలేసింది. అంతలో బౌన్సర్స్ అలెర్ట్ అయి, ఆమెకు ప్రొటక్షన్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
తమ అభిమాన తారలను కలిసే అవకాశం వస్తే అభిమానులు ఉత్సాహం ఆపుకోవడం కష్టమే. ఈ మధ్య అల్లు అర్జున్ ఫ్యాన్ మీట్ ఏర్పాటు చేసి, ఈ ఈవెంట్‌కు వచ్చిన వాళ్లందరికీ ఫొటోలు ఇవ్వగా.. ఒక ఫ్యాన్ అతణ్ని ముద్దు పెట్టేసుకున్నాడు.
ఇటీవల జూనియర్ ఎన్టీఆర్.. ఒక మూగ, చెవిటి అభిమానిని కలిసి తనతో ప్రేమగా ఫొటోలు దిగగా, అతను కూడా తారక్‌కు ముద్దు ఇచ్చేశాడు. ఐతే అభిమానంతో ఇలా కొంచెం సున్నితంగా వ్యవహరిస్తే ఓకే కానీ.. కొందరు సెలబ్రెటీలు కనిపించినపుడు శ్రుతి మించి ప్రవర్తిస్తుంటారు. అలాంటి సందర్భాల్లోనే సినీ తారలు తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు.
This post was last modified on October 3, 2026 2:31 pm
భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…