ఏఐ దుర్వినియోగమవుతున్న తీరు చూస్తుంటే టెక్నాలజీ తాలూకు పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయా అనిపిస్తుంది. రోబోలో ఒక యంత్రం హీరోయిన్ ని ప్రేమిస్తే కలిగే పరిణామాలను శంకర్ ఊహించి చూపించాడు. కానీ తమతో పోల్చుకుంటే అది చాలా చిన్న తప్పనే రీతిలో కొందరు నెటిజెన్లు చేస్తున్న ఘోరాలు సిగ్గుతో తలదించుక్కునేలా ఉన్నాయి. దేవరలో చుట్టమల్లే పాటని మార్ఫింగ్ చేసి తారక్, జాన్వీ కపూర్ మధ్య సన్నివేశాలను అశ్లీలంగా మార్చిన వీడియో ఒకటి ఎక్స్ లో వైరల్ అయ్యింది.
చాలా అభ్యంతరకరంగా ఉన్న ఆ వీడియో తక్కువ వ్యవధిలోనే లక్షల మందికి చేరిపోయింది. దీని గురించి జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా చాలా తీవ్రంగా స్పందించాడు. తల్లిని దేవతగా పూజించే చోట ఇంత సిగ్గుమాలిన పనులు చేస్తున్న వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఎన్ని అవకాశాలు ఉంటే అన్నీ వాడి చట్టపరంగా చర్యలు తీసుకుంటానని హెచ్చరించడం చర్చనీయాంశం అవుతోంది. సైబర్ క్రైమ్ సహాయంతో నిందితులను వెతికే పని ఆల్రెడీ మొదలయ్యిందని సమాచారం.
ఇలాంటి వాటికి బ్రేక్ పడాలంటే ముందు చట్టాలు కఠినంగా మారాలి. ఏదైనా సరదాగా అనిపించేంత వరకే బాగుంటుంది. హద్దులు దాటితే జుగుప్స కలుగుతుంది. ఈ మధ్యే బ్రహ్మానందం, నయనతార మీద అదుర్స్ స్పూఫ్ వీడియోలు బాగా ప్రాచుర్యం పొందాయి. అవి అసహ్యంగా లేకపోవడంతో నటీనటులతో పాటు నిర్మాణ సంస్థ లైట్ తీసుకుంది. కానీ దేవర విషయంలో జరిగింది చాలా పెద్ద తప్పు. దీని తాలూకు శిక్షలు, పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే సందేశం జనంలోకి వెళ్ళాలి.
ఇలాంటివి ముందే గుర్తించిన చిరంజీవి, అమితాబ్ బచ్చన్, నాగార్జున, తారక్, ఐశ్వర్య రాయ్ లాంటి వాళ్ళు తమ హక్కులను కాపాడుకునేందుకు ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తీసుకోబోయే చర్యలు ఎలా ఉండాలంటే మళ్ళీ ఇలాంటి తప్పు చేయడానికి ఒక్కొక్కరు భయపడాలి. తారక్ అన్నట్టు ఇవాళో ఎవరో, రేపు మీ ఇంట్లో తల్లో చెల్లో కావొచ్చు. ఈ దుస్థితి రాకూడదంటే నేరానికి తగ్గ శిక్షలు ఉండాలి. జూనియర్ ఎన్టీఆర్ బృందం ప్రస్తుతం ఇదే పని మీద వర్క్ చేస్తోందట.
This post was last modified on October 3, 2026 3:33 pm
ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద…
ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నాయి? వైసీపీకి ఎన్ని స్థానాలు…
భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…