ఒకప్పుడు స్టార్ హీరోలుగా వెలుగొందిన వారు ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్లుగా విలన్స్ గా మారుతున్న విషయం తెలిసిందే. సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసేందుకు కూడా ఏమాత్రం వెనుకాడటం లేదు. ఇక సౌత్ లో ఈమధ్య నార్త్ సీనియర్లు బాగానే బిజీ అవుతున్నారు. రెమ్యునరేషన్ లెక్క కూడా 7 నుంచి 10 కోట్ల మధ్యన ఉంటోంది. దీంతో మీడియం బడ్జెట్, బిగ్ బడ్జెట్ అని తేడా లేకుండా నచ్చిన ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
ఆ మధ్య సంజయ్ దత్ సౌత్ లో బాగానే ట్రెండ్ అయ్యాడు. KGF తో విలన్ గా మంచి క్రేజ్ అందుకున్న అనంతరం ఒక్కసారిగా అవకాశాలు పెరిగాయి. వెంటనే లియో, డబుల్ ఇస్మార్ట్ ఆఫర్స్ వచ్చాయి. కానీ ఆ సినిమాలు అంతగా క్లిక్కవ్వలేదు. ప్రస్తుతం రాజా సాబ్ లో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక సంజయ్ కు పోటీగా ఇప్పుడు యానిమాల్ విలన్ బాబీ డియోల్ వచ్చి చేరాడు. అతను ఇప్పుడు సౌత్ లో మంచి లైనప్ సెట్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ దశలో ఉంది. తమిళ్ లో కంగువా సినిమాలో కూడా కనిపించనున్నాడు. రీసెంట్ గా విజయ్ 69వ సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేశాడు. అలాగే మరో తెలుగు సినిమాలో కూడా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ విధంగా విలన్ కేటగిరిలో సంజూ భాయ్ ను మెల్లగా బాబీ డామినేట్ చేస్తున్నాడు. అంతే కాకుండా సంజయ్ దత్ రెమ్యునరేషన్ కంటే కూడా అతనిది తక్కువే. అలాగే కాస్త ప్రాజెక్టుకు తగ్గట్టుగా బాబీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. క్యారెక్టర్ నచ్చితే రెమ్యునరేషన్ తగ్గించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ నిర్ణయం కూడా దర్శక నిర్మాతల ఫోకస్ అతనిపై పడేలా చేస్తోంది.
This post was last modified on October 13, 2024 4:11 pm
టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దల ముందు…
ఏ సినిమాకైనా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కోతకు గురైన సీన్లు, భాగాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ అవి ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని…
కొన్ని నెలల కిందట జానీ మాస్టర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు, తనపై నమోదైన కేసు ఎంతటి సంచలనం…
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు ఈ రోజు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి…
టాలీవుడ్ సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో ఆసక్తికరంగా మారిన సంగతి…
సామాజిక భద్రతా పింఛన్.. ఇది చాలా సునిశితమైన అంశం. ఆర్థికంగా ముడిపడిన వ్యవహారమే అయినా .. అత్యంత సెన్సిటివ్ అంశం.…