భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా వుంటూ వంద కళ్ళతో పహారాకాసే సైన్యం నిముషాల్లో ఆ బాలికను అదుపులోకి తీసుకోవడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగలేదు. అసలేం జరిగిందంటే…
పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే కు చెందిన 17 ఏళ్ళ ఓ బాలిక అనుమానాస్పదంగా కనిపించింది. జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్ పరిధిలోని లామ్ ప్రాంతంలో నియంత్రణ రేఖ వద్ద గల ఫెన్సింగ్ వద్ద తిరుగుటుండగా భారత సైన్యం పసిగట్టింది. వెంటనే ఆ బాలికను అదుపులోకి తీసుకొన్న సైన్యం అక్కడికక్కడే విచారణ జరిపింది. విచారణలో ఆమెను పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని కోట్లి జిల్లా ఖుయ్ రెట్టా గ్రామానికి చెందిన పదిహేడేళ్ల బాలిక సామియా అజీమ్ గా గుర్తించారు. బాలిక వద్ద ఎలాంటి అపాయకరమైన ఆయుధాలు కానీ అనుమానస్పద వస్తువులు కానీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
సామియా చెబుతున్న వివరాల ప్రకారం పొరపాటున ఆమె సరిహద్దులు దాటినట్లు తెలుస్తోంది. తాను కావాలని రాలేదని, పొరపాటున దారితప్పి వచ్చానని చెప్పింది. ఆమె నిజంగానే పొరపాటున సరిహద్దు దాటిందా లేక దీని వెనుక మరేదైనా కుట్ర కోణం దాగుందా అనే కోణంలో భద్రతా సంస్థలు, పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు జరుపుతున్నారు.
సాధారణంగా ఇలాంటి కేసుల్లో బాలిక నిజాయితీ రుజువైతే సరిహద్దుల వద్ద ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించి మానవతా దృక్పథంతో పాకిస్తాన్ కు అప్పగించే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఆమె నౌషేరా పోలీసుల అదుపులో వుంది.
This post was last modified on October 3, 2026 1:26 pm
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…