ఏదైనా పెద్ద సినిమా తాలూకు ప్రమోషనల్ కంటెంట్ బయటికి వస్తోందంటే కోట్లాది కళ్ళ శల్యపరీక్ష జరుగుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియా జమానాలో ప్రశంసలైనా విమర్శలైనా క్షణాల్లో వైరలైపోతున్నాయి. తాజాగా విడుదలైన విశ్వంభర టీజర్ గురించి అలాంటి చర్చే ట్విట్టర్, ఇన్స్ టా తదితర సామజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. కాన్సెప్ట్ ఏంటో చెప్పినప్పటికీ విఎఫ్ఎక్స్ నాణ్యత గురించి నెగటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అవతార్, అవెంజర్స్ లాంటి హాలీవుడ్ మూవీస్ ని పోలిన విజువల్స్ తీసుకున్నారని, అవైనా అత్యున్నత స్థాయిలో ఉన్నాయా అంటే లేదనే మిశ్రమ స్పందన వినిపిస్తోంది.
దసరా పండగ కాబట్టి ఎలాగైనా టీజర్ విడుదల చేయాలని టార్గెట్ గా పెట్టుకున్న వశిష్ఠ పదిహేను రోజుల పాటు నిద్ర పోకుండా దీని మీదే పని చేసిన మాట వాస్తవమే. ఆ ఒత్తిడిలో ఏమైనా క్వాలిటీ తగ్గిందో లేక ఇంకా బోలెడు టైం ఉంది కాబట్టి ఫైనల్ కట్ లో మార్పులు చేసే అవకాశముందో ఇప్పుడే చెప్పలేం కానీ విశ్వంభర టీమ్ కు ఫ్యాన్స్ నుంచి మద్దతు దక్కుతుండగా యాంటీ ఫ్యాన్స్ నుంచి కొంత ట్రోలింగ్ ఎదురవుతోంది. ఇది ప్రతి హీరో టీజర్, ట్రైలర్ సమయంలో జరిగేదే. దేవరకు ఇదే తరహాలో సొరచేప, సముద్రం తదితర ఎఫెక్ట్స్ మీద కామెంట్స్ వచ్చాయి. సినిమా రిలీజయ్యాక దూదిపింజెల్లా ఎగిరిపోయాయి.
ఏది ఎలా ఉన్నా విశ్వంభర బృందానికి ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ హెచ్చరిక లాంటిది. కల్కి, బాహుబలి, సాహో లాంటి ప్యాన్ ఇండియా సినిమాల టీజర్లు వచ్చినప్పుడు నెగటివ్ అనే మాటే వినిపించలేదు. కానీ కొన్నింటికి జరుగుతున్నాయంటే తేలిగ్గా తీసుకునే విషయం కాదు. యాంటీ ఫ్యాన్స్ ని పట్టించుకోనవసరం లేదనే నిర్లక్ష్యమూ వద్దు. ఇంకా ఆరు నెలలకు పైగా సమయం ఉంది. విశ్వంభర ఎడిటింగ్, గ్రాఫిక్స్ మీద సీరియస్ ఫోకస్ పెట్టాలనేది మెగా ఫ్యాన్స్ అభిప్రాయం. బింబిసారలో మీడియం బడ్జెట్ తోనే అద్భుతం చేసిన వశిష్ట విశ్వంభర లాంటి గ్రాండియర్ ని తేలిగ్గా తీసుకుంటాడా. ఛాన్సే లేదు.
This post was last modified on October 12, 2024 7:45 pm
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…