గత వారం రోజులుగా జరుగుతున్న ప్రచారాలకు నిర్మాత దిల్ రాజు చెక్ పెట్టేశారు. ముందు నుంచి చెబుతూ వచ్చినట్టు గేమ్ ఛేంజర్ డిసెంబర్ లో క్రిస్మస్ పండగకు కాకుండా సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. మూడేళ్ళ నుంచి నిర్మాణంలో ఉంటూ విపరీతమైన అంచనాలు మోస్తున్న ఇలాంటి ప్యాన్ ఇండియా మూవీ జనవరిలో రావడమే సబబని భావించి విశ్వంభర నిర్మాతలైన యువి బృందంతో పాటు చిరంజీవిని సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ మేరకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అనౌన్స్ మెంట్ ని వీడియో రూపంలో చేశారు.
దీంతో తాజా సంక్రాంతి సమీకరణాలు మారిపోయాయి. దిల్ రాజు నిర్మాతగా వెంకటేష్ – దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న ఎంటర్ టైనర్ కూడా రెండు మూడు రోజుల గ్యాప్ లో గేమ్ ఛేంజర్ తో పాటుగా విడుదల కానుంది. బాలయ్య 109, అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ, సందీప్ కిషన్ మజాకాలు బరిలో ఉండబోతున్నాయి. ఏవి ఖరారుగా ఉంటాయి, ఏవి తప్పుకుంటాయనేది ఇంకా వేచి చూడాలి. డిసెంబర్ మూడో వారం మూడు హాలీవుడ్ రిలీజులు ఉండటం వల్ల ఓవర్సీస్ లో ఎదురయ్యే థియేటర్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని గేమ్ ఛేంజర్ ని వాయిదా వేయడం తెలివైన ఆలోచన.
ఇప్పటికే ప్రమోషన్లు మొదలుపెట్టిన దిల్ రాజు టీమ్ రెండు పాటలు విడుదల చేసింది . వాటిలో రా మచ్చకు మంచి రీచ్ వచ్చింది. ఈ నెలాఖరున దీపావళికి మూడో మెలోడీ సాంగ్ వదలబోతున్నారు. ఇంకా టైం ఉంది కాబట్టి టీజర్, ట్రయిలర్ ఇప్పుడప్పుడే ఆశించకపోవడం మంచిది. వచ్చే నెల నుంచి పుష్ప 2 ది రూల్ పబ్లిసిటీ సౌండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇతర ప్యాన్ ఇండియా సినిమాలు ప్రమోషన్ పరంగా ఎక్కువ హడావిడి చేయకపోవచ్చు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన గేమ్ ఛేంజర్ లో చరణ్ డ్యూయల్ రోల్, తమన్ సంగీతం, ఎస్జె సూర్య విలనీ మీద ఎక్కువ అంచనాలున్నాయి.
This post was last modified on October 12, 2024 11:30 am
ఒక సినిమా భారీ నష్టాలు మిగిలిస్తే.. ఆ చిత్రలో భాగమైన వాళ్లు చేసే తర్వాతి చిత్రం మీద దాని ఎఫెక్ట్ పడడం…
ప్రభుత్వ వైద్య సేవల గురించి పెదవి విరవని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. వాస్తవ పరిస్థితులు అలా ఉన్నాయి మరి.…
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో మొదలైన పార్టీ వైసీపీ..ఎందరో నేతలను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. కొందరిని అసెంబ్లీలోకి అడుగుపెట్టిస్తే… మరికొందరిని…
ఆర్ మాధవన్, నయనతార, సిద్దార్థ్. ఈ మూడు పేర్లు చాలు ఒక కంటెంట్ మీద ఆసక్తి పుట్టి సినిమా చూసేలా…
దేవర టైంలో ప్రత్యక్షంగా తనను పబ్లిక్ స్టేజి మీద చూసే అవకాశం రాలేదని ఫీలవుతున్న అభిమానుల కోసం ఇవాళ జూనియర్…
నిజమే.. లెక్కంటే లెక్కే. ఏదో చేతికి వచ్చినంత ఇచ్చుకుంటూ పోతే ఎక్కడో ఒక చోట బొక్క బోర్లా పడిపోతాం. అలా…