ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ అయినా రెండు వారాలు దాటితే బాగా నెమ్మదించిపోతుంది. కానీ దేవరకు మాత్రం బ్లాక్ బస్టర్ దక్కిన ఆనందంతో పాటు అదృష్టం కూడా కలిసివస్తోంది. కీలకమైన దసరా పండక్కు ఒకటి రెండు కాదు ఏకంగా ఆరు కొత్త రిలీజులు ఉన్నా దేవరకు మంచి థియేటర్ కౌంట్ కొనసాగుతోంది. కారణం కలెక్షన్లు స్టడీగా ఉండటమే. అయిదు వందల కోట్ల గ్రాస్ కు అతి దగ్గరగా ఉన్న ఈ మాస్ బొమ్మకు ఈ వీకెండ్ మరో అవకాశాన్ని సృష్టిస్తోంది. కొత్త సినిమాల్లో టయర్ 1 స్టార్లు ఉన్నవి ఏవీ లేకపోవడంతో ఇప్పటిదాకా థియేటర్లో చూడని వాళ్ళకు దేవర ఫస్ట్ ఆప్షన్ అవుతోంది.
వేట్టయన్ తీర్పు దాదాపు వచ్చినట్టే. ఫ్లాప్ మాట వినిపించలేదు కానీ జైలర్ స్థాయిలో మేజిక్ చేయదని అర్థమైపోయింది. మా నాన్న సూపర్ హీరో గురించి వస్తున్న ఎమోషనల్ రిపోర్ట్స్ కుటుంబ ప్రేక్షకులను ఏ మేరకు రప్పిస్తాయో చూడాలి. ఎంటర్ టైన్మెంట్ ని నమ్ముకున్న జనక అయితే గనక ఫలితం రేపు వస్తుంది. గోపీచంద్ విశ్వం కు డీసెంట్ రివ్యూస్ వినిపిస్తున్నాయి. శ్రీను వైట్ల కంబ్యాక్ అవుతారా లేదానేది వేచి చూడాలి. ఇక మార్టిన్ కు ఏవో ఆర్థిక కారణాల వల్ల చాలా చోట్ల ఉదయం షోలు పడలేదు. ఇంత భారీ చిత్రానికి అసలే బజ్ లేదు. దానికి తోడు ఇలాంటి అడ్డంకులు ఉన్న ఆసక్తిని తగ్గిస్తాయి.
అలియా భట్ జిగ్రాను ఇప్పటికైతే జనాలు పెద్దగా పట్టించుకోలేదుమల్టీ . మల్టీప్లెక్సుల్లో హిందీ వెర్షన్ కు డిమాండ్ ఉంది. ఇవన్నీ గమనిస్తే దేవరకు ఇంకో వారాంతం దున్నేసే ఛాన్స్ దొరికినట్టే. ప్రస్తుతానికి టీమ్ ప్రమోషన్లు ఆపేసింది కానీ ఇప్పటికే పబ్లిక్ లోకి వెళ్ళిపోయిన టాక్ తో పాటు ఓటిటి స్ట్రీమింగ్ యాభై రోజుల తర్వాతే ఉంటుందనే వార్త కలెక్షన్లకు దోహదపడుతోంది. మెయిన్ సెంటర్స్ లో శని ఆదివారాలు హౌస్ ఫుల్స్ పడటం ఖాయం. నైజాం, సీడెడ్ లో దేవర స్ట్రాంగ్ గా ఉంది. పండగ సందర్భంగా పదిహేనో రోజు అనంతపురం లాంటి చోట్ల ఉదయం ఎనిమిది గంటలకు స్పెషల్ షోలు వేస్తున్నారు.