పీపుల్స్ మీడియా.. ప్రస్తుతం తెలుగులో హ్యాపెనింగ్ బేనర్. క్వాంటిటీ పరంగా చూస్తే మరే ప్రొడక్షన్ హౌస్ అందుకోలేని స్థాయిలో సినిమాలు తీస్తోందీ సంస్థ. కానీ క్వాలిటీ మీదే ఈ మధ్య సందేహాలు రేకెత్తుతున్నాయి. కార్పొరేట్ నేపథ్యం నుంచి వచ్చిన ఈ సంస్థ.. మొదట్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలే ప్రొడ్యూస్ చేసింది. వేరే సంస్థల భాగస్వామ్యంలో సినిమాలు చేసింది. ఈ క్రమంలో గూఢచారి, ఓ బేబీ, కార్తికేయ-2 లాంటి మంచి విజయాలు అందుకుంది.
ఆ తర్వాత సొంతంగా పెద్ద స్థాయిలో సినిమాలు ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టింది. ఈ సంస్థ నుంచి ఒకే సమయంలో ఏకంగా పాతిక చిత్రాలు వివిధ దశల్లో ఉన్నాయంటే దాని దూకుడు ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. వాటిలో చాలా వరకు క్రేజీ కాంబినేషన్లలో తెరకెక్కుతున్న పెద్ద సినిమాలే. ఐతే సొంత ప్రొడక్షన్లో చేసిన సినిమాల్లో ‘ధమాకా’ ఈ సంస్థకు మంచి విజయాన్నందించింది.
కానీ ఆ తర్వాత ఆ సంస్థకు సరైన విజయమే లేదు. గోపీచంద్‌తో చేసిన ‘రామబాణం’ సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో తీసిన క్రేజీ మూవీ ‘బ్రో’ నిరాశ పరిచింది. ఈ ఏడాది ఈగల్, మనమే, మిస్టర్ బచ్చన్.. ఇలా ఒక్కో సినిమా బోల్తా కొడుతూ వచ్చింది. ఐతే మిస్టర్ బచ్చన్ తర్వాత తాము జాగ్రత్తగా అడుగులు వేస్తున్నామని.. వరుసగా తమ నుంచి క్వాలిటీ సినిమాలు రాబోతున్నాయని చెప్పారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్.
కానీ ఈ సంస్థ నుంచి వచ్చిన లేటెస్ట్ రిలీజ్ ‘శ్వాగ్’ కూడా నిరాశ పరిచింది. ప్రయోగాత్మక కథతో హాసిత్ గోలి చేసిన ప్రయత్నం ప్రేక్షకులకు రీచ్ కాలేకపోయింది. ఏదో ఓ మోస్తరుగా ఆడింది కానీ.. అంతిమంగా ఫలితం అయితే ఆశాజనకంగా లేదు. ఒక్క ఏడాదిలో ఇప్పటికే నాలుగు ఫ్లాపులు పడ్డ పీపుల్స్ మీడియాకు.. ఇప్పుడు ‘విశ్వం’ మీదే ఆశలు ఉన్నాయి. ఇది దసరా కానుకగా రిలీజవుతోంది. ఈ చిత్రమైనా బాగా ఆడి ఆ సంస్థను మళ్లీ విజయాల బాట పటిస్తుందేమో చూడాలి.
This post was last modified on October 11, 2024 12:03 pm
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…
తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…