కరోనా సమయంలో దర్శకుడు సుకుమార్, విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. స్టోరీ లైన్ సెట్టవ్వగనే “రాంపేజ్” అంటూ సుకుమార్‌తో దిగిన ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ కాంబినేషన్ పక్కా తెరపైకి వస్తుందని అందరూ అనుకున్నారు. అయితే ఇండస్ట్రీలో అన్ని అనుకున్నట్లు జరిగే అవకాశాలు తక్కువ కాబట్టి అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి.
అసలే సుకుమార్ మేకింగ్ కోసం ఏ రేంజ్ టైమ్ తీసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి కంటే భిన్నమైన పని రక్షసుడిలా మారిపోతున్నాడు. ఎందుకంటే బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నా కూడా పుష్ప 2 అనుకున్న సమయానికి సిద్ధం కాలేదు. ఇప్పటికే ఒకసారి రిలీజ్ డేట్ కూడా మారింది.
ఇక సుకుమార్, పుష్ప 2 తరువాత రామ్ చరణ్ ప్రాజెక్టును లైన్ లో పెట్టనున్నాడు. ఆ సినిమాకు మూడేళ్ళ టైమ్ పట్టినా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. అసలే రంగస్థలం కాంబో కాబట్టి లెక్కలు అంచనాలు ఆకాశాన్ని దాటేస్తాయి. దీంతో సుక్కు మునుపటి కంటే ఎక్కువ టైమ్ తీసుకునే అవకాశం ఉంది. అలాగే పుష్ప 3 కూడా ఉండవచ్చని ఆమధ్య ఒక హింట్ ఇచ్చారు. దాంతో విజయ్ దేవరకొండ ర్యాంపేజ్ అసలు ఎప్పుడు ఉంటుందనేది మిస్టరీగా మారింది.
విజయ్ ప్రస్తుతం మూడు సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇక ఆ లోపు సుక్కు చరణ్ ప్రాజెక్టును ఫినిష్ చేసి దేవరకొండ ర్యాంపేజ్ పై ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఒకవేళ పుష్ప 2 వెయ్యి కోట్లు, రామ్ చరణ్ ప్రాజెక్టు కూడా అదే రేంజ్ లో హిట్టయితే మాత్రం దేవరకొండ సుక్కు కాంబోపై అసలు డౌట్ క్రియేట్ అవుతుంది. అసలే పాన్ ఇండియా అగ్ర హీరోలు సుక్కు ఎప్పుడు దొరుకుతాడా అని కాచుకొని ఉన్నారు.
లైగర్ సక్సెస్ అయ్యి ఉంటే సుక్కు ఈజీగా లైన్ లోకి వచ్చేవారేమో. సుక్కు లాంటి డైరెక్టర్ తో ఛాన్స్ అందుకోవాలి అంటే విజయ్ ఆ లోపు సాలీడ్ హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది. ఇక వెయ్యి కోట్లు కొట్టగలిగితే సుక్కుని అగ్ర హీరోలు లాగే అవకాశం కూడా లేకపోలేదు. మరి విజయ్ కు ఇచ్చిన మాట ప్రకారం సుక్కు డైవర్ట్ కాకుండా ర్యాంపేజ్ ను సెట్స్ పైకి తీసుకు వస్తాడో లేదో చూడాలి.
This post was last modified on October 11, 2024 10:11 am
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…