ఇంకో పంతొమ్మిది రోజుల్లో అక్టోబర్ 23 డార్లింగ్ ప్రభాస్ పుట్టినరోజు రానుంది. ఈ సందర్భంగా ఎలాంటి కానుకలు ఉంటాయనే దాని మీద ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటిది ది రాజా సాబ్ నుంచి లిరికల్ సాంగ్ లేదా కొత్త టీజర్ కానీ వస్తుందనే అంచనాలున్నాయి. విడుదల తేదీ ఏప్రిల్ 10 ఇంకా దూరం ఉన్నప్పటికీ నెక్స్ట్ ప్రభాస్ రిలీజ్ ఇదే కాబట్టి ఒక కీలక అప్ డేట్ అయితే రావాలి. దర్శకుడు మారుతీ దీని కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు తెలిసింది. షూటింగ్ చివరి దశలో ఉన్న నేపథ్యంలో ఏ కంటెంట్ ఇవ్వాలనే దాని గురించి పెద్దగా టెన్షన్ అక్కర్లేదు. ఏది ఇవ్వాలనేది కీలకం.
హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందబోయే ఫౌజీ (ప్రచారంలో ఉన్న టైటిల్) ఫస్ట్ లుక్ రావొచ్చని ఇన్ సైడ్ టాక్. ప్రభాస్ ని ఎప్పుడూ చూడని సరికొత్త మేకోవర్ లో చూడబోతున్నామనే సమాచారం అభిమానులను ఎగ్జైట్ చేస్తోంది. ఇక స్పిరిట్ గురించి విజువల్ లేకుండా ప్రత్యేక ఆడియో అనౌన్స్ మెంట్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సిద్ధం చేసే ఆలోచనలో ఉన్నాడట. ఖచ్చితంగా ఉంటుందో లేదో ఇప్పుడే చెప్పలేం. ఇక కల్కి 2కి సంబంధించిన కీలకమైన అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ కొట్టిపారేయలేం. అయితే రిలీజ్ డేట్, ఏ సంవత్సరం లాంటివి ఆశించకుండా ఉంటే బెటర్.
ఇక సలార్ 2 శౌర్యంగ పర్వం నుంచి కేవలం విషెస్ తప్ప ఇంకేమీ ఉండకపోవచ్చు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా పూర్తి చేసుకుని ఎప్పుడు అందుబాటులోకి వస్తాడనే దాని మీద సరైన సమాచారం ఇంకా లేదు. సో సలార్ 1 స్టిల్ తోనే శుభాకాంక్షలు చెబుతారట. ఇవి కాకుండా ఇంకెలాంటి సర్ప్రైజ్ ఉండకపోవచ్చు. అయినా కడుపు నిండిపోయేలా ఇన్ని అప్డేట్స్ ఇస్తే ఇంతకన్నా ఏం కావాలి. ఇక రీ రిలీజుల సంగతి చూస్తే ఈశ్వర్, డార్లింగ్ రెండూ పోటాపోటీగా థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి. నిన్న చక్రం విడుదల చేస్తే ఎవరూ పట్టించుకోలేదు.
This post was last modified on October 4, 2024 6:42 pm
టార్గెట్ కేటీఆర్.. లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న…
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…