Movie News

మృత్యుంజయ్ మనసు మారితే మంచిదే

కేవలం ఒక్క రోజు గ్యాప్ లో శ్రీవిష్ణు రెండు సినిమాలు రిలీజ్ కానుండటం గురించి అభిమానుల కంటే ఎక్కువగా డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఎంత మాత్రం సేఫ్ కాదు. అసలే జనాలు థియేటర్లకు పెద్దగా రావడం లేదు. పిల్లలు, యువత పరీక్షల మూడ్ లో ఉన్నారు.

అలాంటప్పుడు ఒకే హీరో నుంచి డబుల్ డోస్ వస్తే దాన్ని బాక్సాఫీస్ ఏ మేరకు అంగీకరిస్తుందనేది పెద్ద సవాల్. విష్ణు విన్యాసం, మృత్యుంజయ్ రెండూ నువ్వా నేనా అనేలా ఢీ కొట్టేందుకు రెడీ కావడం ఊహించని ట్విస్టు. అయితే ఫ్యాన్స్ రిలీఫ్ అయ్యేలా ఒక కీలక పరిణామం చోటు చేసుకోవచ్చని అంటున్నారు.

దాని ప్రకారం మృత్యుంజయ్ ఈ క్లాష్ నుంచి తప్పుకుని మార్చి 6కి వెళ్లడం దాదాపు ఖాయమని ఫిలిం నగర్ టాక్. ముందుగా ఒప్పందం జరిగినప్పటికీ ఓటిటి సంస్థతో మాట్లాడుకుని ఈ మేరకు నిర్ణయం మార్చుకున్నారని వినికిడి. దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ ఇవాళ జరిగే విష్ణు విన్యాసం ట్రైలర్ లాంచ్ లో ఉండొచ్చని అంటున్నారు.

ఒకవేళ నిజమే అయితే శ్రీవిష్ణుకి పెద్ద ఊరట దక్కినట్టే. ఎందుకంటే కేవలం పది రోజుల వ్యవధిలో రెండు సినిమాలకు ప్రమోషన్లు చేయడం చాలా కష్టం. పైగా ఒకదాని కోసం ప్రచారం చేస్తే ఇంకోదాని గురించి అడిగే ప్రమాదమున్న నేపథ్యంలో ఇలా సేఫ్ గేమ్ ఆడటం అందరికీ మంచిది.

వేర్వేరు జానర్లు అయినప్పటికీ విష్ణు విన్యాసం, మృత్యుంజయ్ మీద కంటెంట్ పరంగా మంచి అంచనాలు ఉన్నాయి. ఒకటి ఎంటర్ టైనర్ కాగా మరొకటి క్రైమ్ థ్రిల్లర్. శ్రీవిష్ణు ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. గత ఏడాది సింగిల్ రూపంలో డీసెంట్ సక్సెస్ అందుకున్నాక మరో పెద్ద బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న టైంలో ఇలా జరగడం శ్రీవిష్ణుకి తొలుత ఖంగారు కలిగించింది.

ఏం చేయలేని నిస్సహాయతలో ఈ మాత్రం మార్పు జరగడం శుభ పరిణామం. అఫీషియల్ అయ్యాక మరింత క్లారిటీ వస్తుంది కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేయాలి. వచ్చే వారం ఫిబ్రవరి 27 విష్ణు విన్యాసం, మార్చి 6 మృత్యుంజయ్ దాదాపు ఫిక్సైనట్టేనని టాక్.

This post was last modified on February 18, 2026 1:59 pm

Share

Recent Posts

కుటుంబం ముందున్న అసలు ముప్పు

ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఆదర్శ కుటుంబం ఏకే 47 లాంటి రీజనల్ మూవీ ఇంత…

3 hours ago

కళ్యాణ్ నెమ్మదించినా ఇబ్బంది లేదు

మొదటి మూడు రోజులు డీసెంట్ టాక్ తో దూసుకెళ్లిన కామ్రేడ్ కళ్యాణ్ నిన్న సోమవారం నుంచి బాగా డ్రాప్ అయినట్టు…

4 hours ago

పెద్ద గండం దాటేసిన రణబాలి

ఇంకో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రణబాలి బుకింగ్స్ మెల్లగా ఊపందుకుంటున్నాయి. సాధారణంగా ఓవర్సీస్ లో విజయ్ దేవరకొండ చూపించే…

4 hours ago

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

7 hours ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

9 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

9 hours ago