కల్కిలో చూపించింది వేరు, నిజమైన మహాభారతంలో ఉన్నది వేరంటూ గరికపాటి నరసింహారావు గారు ఒక ప్రసంగంలో చేసిన కామెంట్లు వీడియో రూపంలో తెగ వైరలవుతున్నాయి. ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తే రచయిత ఏదైనా రాస్తాడని, సినిమావాళ్ళు ఏది చూపిస్తే అదే నిజమైపోతుందని, అశ్వద్ధామ కర్ణుడు హీరోలైపోగా మిగిలినవాళ్ళు విలన్లా అంటూ ప్రశ్న రేకెత్తించడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. హీరోలు, సినిమాల మీద ఆయన విమర్శలు చేయడం కొత్తేమి కాదు కానీ ఒక ధార్మిక ప్రవచనంలో కల్కి 2898 ఏడి గురించి ప్రస్తావించడం ఫ్యాన్స్ మధ్య చర్చకు దారి తీసింది.
నిజానికి కల్కి 2898 ఏడి నిజంగా జరిగిన కథని దర్శకుడు నాగ్ అశ్విన్ ఎక్కడ చెప్పలేదు. భారతాన్ని తీసుకుని కాల్పనికత జోడించడం ఎప్పటి నుంచో వుంది. అలనాటి మేటి క్లాసిక్ మాయాబజార్ లో చూపించిన కొన్ని ఘటనలు ఇతిహాసంలో లేవు. ఎస్వి కృష్ణారెడ్డి తీసిన ఘటోత్ఘచుడులోనూ దీనికి సంబంధించిన ఫాంటసీ టచ్ ఉంటుంది. జగదేకవీరుడు అతిలోకసుందరిలో ఇంద్రుడి కూతురు ఇంద్రజ భూమి మీదకు వచ్చినట్టు చూపించారు. అది నిజం కాదే. యమగోలలో ఎన్టీఆర్ ఏకంగా దేవేంద్రుడికి క్లాస్ తీసుకోవడం ఏ పురాణాల్లో చదవలేదే. ఇదంతా క్రియేటివ్ ఫ్రీడమ్ కిందకు వస్తుంది.
వీటి వల్ల మనోభావాలు దెబ్బ తినడం లాంటివి జరగలేదు. తప్పని ఎవరూ వేలెత్తి చూపలేదు. కల్కి కూడా ఆ కోవలోకే వస్తుంది. దుర్యోధన, కర్ణ స్నేహాన్ని హైలైట్ చేసిన స్వర్గీయ ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ ఇండస్ట్రీ హిట్ అయితే ఉన్నదున్నట్టు తీసిన కృష్ణ కురుక్షేత్రం ఆడలేదు. రెండూ ఒకే కథలే. ప్రేక్షకులు దేన్ని అంగీకరిస్తారు దేన్ని తిరస్కరిస్తారనే దాన్ని బట్టి హిట్టు ఫ్లాపు ఆధారపడి ఉంటుంది. కల్కి వేయి కోట్లు ఊరికే వసూలు చేయలేదుగా. హిందీ నుంచి తెలుగు దాకా అన్ని భాషల్లోనూ అంగీకారం దక్కింది కాబట్టే బ్లాక్ బస్టర్ నమోదయ్యింది. లాజిక్స్ వెతికే పని పెట్టుకుంటే ఎలా.
This post was last modified on September 23, 2024 10:59 am
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేదు. మహిళలపై నోరుపారేసుకునే నేతగా, స్త్రీలోలుడిగా ట్రంప్ నకు చెడ్డపేరుంది.…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…