దేవర పార్ట్ 1కి అనిరుధ్ ఇచ్చిన పాటలు అభిమానులకు సంతృప్తినిచ్చాయి. రెగ్యులర్ టాలీవుడ్ స్టైల్ కి భిన్నంగా తనదైన శైలిలో ఇచ్చిన బాణీలు మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకున్నాయి. తెరమీద చూశాక మరింత రీచ్ పెరిగే అవకాశాలు కొట్టి పారేయలేం. ఇక ఇప్పుడు అందరి చూపు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ మీద ఉంది. ఈ ఆదివారం హైదరాబాద్ నోవాటెల్ లో ఘనంగా నిర్వహించబోతున్నట్టు సమాచారం. ముందు ఏదైనా ఓపెన్ గ్రౌండ్ లో చేద్దాం అనుకున్నారు కానీ వర్షం ముప్పుతో పాటు సెక్యూరిటీ, ఏర్పాట్లకు తక్కువ సమయం లాంటి కారణాల వల్ల నిర్ణయం మార్చుకున్నారని తెలిసింది.
సరే వేడుక ఎక్కడ జరిగినా ఫ్యాన్స్ నుంచి వచ్చే డిమాండ్ ఒకటుంది. మాములుగా తమిళంలో జరిగే ఈవెంట్లలో అనిరుద్ రవిచందర్ లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ ఉంటుంది. స్టేజి మీద పాటలు పాడుతూ వచ్చినవాళ్లు వెర్రెత్తిపోయేలా కిక్ ఇస్తాడు. జైలర్ కు అతనిచ్చిన జోష్ అంతా ఇంతా కాదు. రజినీకాంత్ స్పీచ్ కన్నా అనిరుధ్ పెర్ఫార్మన్స్ హైలైట్ కావడం అబద్దం కాదు. ఇలా చాలాసార్లు ఎనర్జీ ఇచ్చిన అనిరుధ్ ఇప్పుడు హైదరాబాద్ వచ్చి అదే సీన్ రిపీట్ చేయాలనేది సగటు తెలుగు మూవీ లవర్స్ కోరిక. అది నెరవేరుతుందా లేదా అనేది ఇంకో మూడు రోజులు ఆగితే తెలుస్తుంది.
దేవర మీద ఇతర భాషల్లో అంచనాలు ఏర్పడేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్ ఒక కారణమైతే అనిరుధ్ బ్రాండ్ మరో రీజన్ అవుతోంది. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి తారక్ అభిమానులు ఓ రేంజ్ లో ఆశలు పెట్టుకున్నారు. చాలా హెవీ యాక్షన్ ఉన్న వయొలెంట్ సబ్జెక్టు కావడంతో తను ఇచ్చే ఎలివేషన్లు థియేటర్లలో పేలాలని కోరుకుంటున్నారు . చెన్నై ప్రెస్ మీట్ లో ఓ రెండు లైన్లు పాడి సరిపుచ్చిన అనిరుద్ ఈసారి పూర్తి ప్రోగ్రాం చేయాలనేది అసలు డిమాండ్. మరి అనిరుద్ దాన్ని నెరవేరుస్తాడో లేదో, అసలు హైదరాబాద్ వచ్చేంత తీరిక ఉందో లేదో లెట్ వెయిట్ అండ్ సీ.