చిరంజీవి – రమ్యకృష్ణ కాంబినేషన్ అప్పట్లో మాస్‍ని ఉర్రూతలూగించింది. రజనీకాంత్ ‘నరసింహా’లో రమ్యకృష్ణ చేసిన నీలాంబరి క్యారెక్టర్ లాంటిది చిరంజీవి సినిమాలో వుంటే భలే వుంటుందని ఫాన్స్ ఆశ పడినా మన దర్శకులెవరూ అలాంటి ఐడియాలతో ముందుకు రాలేదు.
నీలాంబరి రేంజ్ క్యారెక్టర్ కాకపోయినా కొంచెం ఆ సినిమాను తలపించే పాత్రల్లో ఈ ఇద్దరూ త్వరలో కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. లూసిఫర్ రీమేక్‍లో మంజు వారియర్ ఒరిజినల్‍లో చేసిన క్యారెక్టర్‍కి తెలుగులో రమ్యకృష్ణ అయితే బాగుంటుందని వినాయక్ సూచించినట్టు సమాచారం. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో మంజు వారియర్ పాత్ర చాలా ఎఫెక్టివ్‍గా వుంటుంది. రమ్యకృష్ణ ఆ పాత్రకు బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి.
ఆచార్య తర్వాత ఏ సినిమా ముందుగా మొదలు పెట్టాలనేది చిరంజీవి డిసైడ్ చేయకపోయినా అటు మెహర్ రమేష్, ఇటు వినాయక్ తమకు అప్పగించిన రీమేక్స్ కోసం సర్వం సిద్ధం చేసేస్తున్నారు. ఈ రెండు చిత్రాలను చిరంజీవి ప్యారలల్‍గా చేస్తారని, రెండూ మూడు నెలల విరామంలో విడుదలవుతాయని కూడా చెబుతున్నారు.