నిన్న విడుదలైన భలే ఉన్నాడే రాజ్ తరుణ్ కి ఊరట కలిగించలేదు. తక్కువ గ్యాప్ లో మూడో సినిమా రిలీజైనా ఫలితం మాత్రం మారకపోవడం తీవ్ర నిరాశకు గురి చేసింది. అసలే ఓపెనింగ్స్ లేవు. టాక్ ఏమంత ఆశాజనకంగా లేకపోవడంతో థియేటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
దానికి తోడు మత్తు వదలరా 2కి వచ్చిన రెస్పాన్స్ మరింత డ్యామేజ్ చేస్తోంది. సరదా కాలక్షేపానికి ఇదే బెస్ట్ ఆప్షననే అభిప్రాయం ప్రేక్షకుల నుంచి బయటికి రావడం భలే ఉన్నాడేకి కోలుకునే ఛాన్స్ ఇవ్వలేదు. పోనీ ఎబోవ్ యావరేజ్ అనిపించుకున్న కొంత ఊరట దక్కది కానీ అది జరగలేదు.
దీనికి మారుతీకి కనెక్షన్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సమర్పకుల్లో ఒకరిగా తన స్వంత బ్యానర్ మీద దీనికి భాగస్వామిగా ఉన్నారు. ప్రమోషన్ల పరంగా కొంత తోడ్పాటు అందించారు కానీ మరీ ఎక్కువ చొరవ తీసుకోలేదు.
తాను దర్శకత్వం వహిస్తున్న ది రాజా సాబ్ హీరో ప్రభాస్ ని అడిగితే ట్రైలర్ లాంచ్ చేయడమో వీడియో బైట్ ఇవ్వడమో చేసేవాడు. కానీ మారుతీ ఆ అవకాశాన్ని వాడుకోలేదు. అపోజిషన్ లో ఉన్న మత్తు వదలరా 2 బృందం ఆ పని చేసి బ్రహ్మాండంగా లాభపడింది. రాజ్ తరుణ్ చుట్టూ ఉన్న వివాదం దృష్ట్యా ప్రభాస్ కి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో వద్దనుకున్నారేమో.
ఏది ఏమైనా భలే ఉన్నాడే విషయంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరు కావడం, ఒక ఇంటర్వ్యూ మినహాయించి మారుతి ఎక్కువ చొరవ తీసుకోకవడం చూస్తే భలే తప్పించుకున్నారే అనిపించకమానదు. నిజానికిది ఓటిటి కోసం తీశారనే టాక్ ఉంది.
అయితే థియేటర్లలో ఎంటర్ టైనర్స్ కు మంది ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో ఇదీ వర్కౌట్ అవుతుందని భావించారు కానీ పనవ్వలేదు. రాజ్ తరుణ్ బ్రాండ్ పడిపోవడం ఓపెనింగ్స్ ని దూరం చేస్తోంది. ఏదో సాలిడ్ కంటెంట్ ఉంటే తప్ప జనాన్ని టికెట్లు కొనేలా చేయడం కష్టం. కేవలం మూడు నెలల లోపే మూడు రిలీజులు చేసుకున్న ఈ యూత్ హీరో ఈ ఏడాది ఇంకో సినిమాతో రావడం డౌటే.