కొన్నేళ్ల ముందు వరకు తమన్నా భాటియాకు సంబంధించి ఎఫైర్లు, బ్రేకప్ వార్తలేమీ వచ్చేవి కావు. ఆమె సౌత్ ఇండియన్ హీరోయిన్ ట్యాగ్‌తో కొనసాగినంత కాలం ఆ చర్చలే లేవు. కానీ ఇక్కడ కెరీర్ ఊపు తగ్గాక బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ ఎక్కువ సినిమాలు, సిరీస్‌లు చేయడం మొదలయ్యాక ఈ తరహా వార్తలు ఊపందుకున్నాయి.
బాలీవుడ్ హీరోయిన్ల గురించి ఇలాంటి చర్చలు ఎప్పుడూ ఉండేవే. తమన్నా కూడా ఆ కోవలోకే చేరింది. విజయ్ వర్మ అనే నటుడితో ఆమె రిలేషన్‌షిప్‌లోకి వెళ్లిన విషక్ష్ం వెలుగులోకి వచ్చింది. ఐతే ఇదంతా తాము కలిసి నటిస్తున్న వెబ్ సిరీస్ కోసం చేసిన స్టంట్ అనే చర్చ కూడా జరిగింది.
కానీ ఆ సిరీస్ రిలీజయ్యాక కూడా తమన్నా, విజయ్ కలిసే కనిపిస్తున్నారు. ఈ క్రమంలో తమన్నా తన రిలేషన్‌షిప్స్ గురించి మాట్లాడుతూ.. ఇప్పటికే తాను రెండుసార్లు ప్రేమలో విఫలమైనట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం.
‘‘ఇప్పటి వరకు నా గుండె రెండుసార్లు ముక్కలైంది. ఆ రెండు సందర్భాల్లోనూ నాకెంతో బాధగా అనిపించింది. టీనేజీలో ఉన్నపుడు తొలిసారి ప్రేమలో దెబ్బ తిన్నాను. ఒక వ్యక్తి కోసం మనకు నచ్చిన జీవితాన్ని వదులుకోవడం నాకు నచ్చలేదు. జీవితంలో ఏదో సాధించాలని, కొత్త విషయాలు అన్వేషించాలని నా భావన.
ఆ కారణంతోనే ఆ బంధం నిలబడలేదు. ఆ తర్వాత కొన్నేళ్లకు మరో వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్నా. కానీ అతను కూడా నాకు సెట్ కాడనిపించింది. ప్రతి చిన్న విషయానికీ అబద్ధం చెప్పేవాళ్లంటే నాకు ఇష్టం ఉ:డదు. అతను ఆ కోవకు చెందిన వాడే. అలాంటి వ్యక్తితో బంధం కొనసాగిస్తే ప్రమాదం అని అర్థమై దాన్ని ముగించేశా.
అలా రెండుసార్లు నా హృదయం పగిలింది’’ అని తమన్నా చెప్పింది. ఐతే విఫలమైన పాత బంధాల గురించి చెప్పిందే కానీ.. ఇప్పుడు కొత్తగా విజయ్ వర్మతో రిలేషన్‌షిప్ గురించి మాత్రం తమన్నా ఏమీ మాట్లాడలేదు.