నిన్న కంట్రీ డిలైట్ పాల ప్యాకెట్ల వీడియో ప్రకటన విడుదలయ్యింది. ఇందులో విశేషం చిరంజీవి మొదటిసారి ఒక ఆన్ లైన్ మిల్క్ సెల్లింగ్ యాప్ కి ప్రమోటర్ గా పని చేయడం. దీనికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు.
మాములుగా కొనేయమని చెబితే జనం వినరు కాబట్టి వెరైటీగా ఒకప్పటి సూపర్ హిట్ మూవీ అన్నయ్యలోని ఆత్మారామ్ ఎపిసోడ్ ని ఇక్కడ వాడుకున్నారు. షూటింగ్ స్పాట్ లో షాట్ కోసం చిరంజీవి ఎదురు చూస్తుంటే సత్య వచ్చి పిలవడం, ఫర్ఫార్మెన్స్ అంటూ కామెడీగా చిరు డ్యూయల్ రోల్ లో తనలో తాను మాట్లాడుకోవడం వెరైటీగా, ఫన్నీగా అనిపించాయి.
ఆ పాల సంగతి కాసేపు పక్కనపెడితే చిరులోని ఈ కామెడీ టైమింగ్ నే వాడుకోవాలని అభిమానులు కోరుతున్నారు. వాల్తేరు వీరయ్యలో అది కొంత తీరినప్పటికీ భోళా శంకర్ లో అస్సలు పనవ్వలేదు. హాస్యాన్ని పండించడంలో మెగాస్టార్ స్టైల్ వేరు.
దొంగమొగుడు, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, చంటబ్బాయి లాంటి సినిమాల్లో పీక్స్ లో ఉంటుంది. ఈ వయసులోనూ అదే ఎనర్జీని చూపించడం పట్ల ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విశ్వంభరకు ముందు క్యాన్సిలైన కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలోని సినిమా కోసం రచయిత బెజవాడ ప్రసన్నకుమార్ ఇలాంటి క్యారెక్టరైజేషనే రాశాడని టాక్ ఉంది.
ఇకనైనా ఇవి ఆశించవచ్చేమో చూడాలి. నిజానికి హరీష్ శంకర్ – చిరు కలయికలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఒక భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తోంది. కానీ కథ కుదరడం లేదని టాక్. దానికి తోడు మిస్టర్ బచ్చన్ ఫలితం తీవ్రంగా నిరాశ పరచడంతో అంత సులభంగా గ్రీన్ సిగ్నల్ రాకపోవచ్చు.
పైగా ముందు ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి కావాలి. అది హిట్టయితే అప్పుడు సమీకరణాలు, లెక్కలు మారిపోతాయి. విశ్వంభర ఫాంటసీ మూవీ అయినప్పటికీ దర్శకుడు వశిష్ట తగినంత వినోదాన్ని చిరు పోషించిన భీమవరం దొరబాబు పాత్రలో చూపించబోతున్నాడని లీక్ ఉంది. అదే నిజమైతే పండగే మరి.