వంద కోట్ల వైపు వేగంగా పరుగులు పెడుతున్న సరిపోదా శనివారంకు రెండో వీకెండ్ రూపంలో ఇంకో పెద్ద అవకాశం దొరికింది,. నిన్న విడుదలైన విజయ్ ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైంకి తెలుగులో నెగటివ్ టాక్, మిక్స్డ్ రివ్యూస్ రావడంతో కలెక్షన్లు మరీ తీసికట్టుగా ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ నిరాశాపూరితంగా ఉన్నాయని ట్రేడ్ ఆందోళన చెందుతోంది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెద్దది కావడంతో లియోని మించిన టాక్ వస్తే తప్ప రాబట్టుకోవడం కష్టం. కానీ పరిస్థితి ఏ మాత్రం సానుకూలంగా లేదు. తమిళ ఫ్యాన్స్ కి నచ్చే అంశాలు ఎక్కువగా ఉండటంతో తెలుగు ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ కావడం లేదు.
ఇప్పుడిది సరిపోదా శనివారంకి ఇంకో ఛాన్స్ ఇచ్చేసింది. వర్షాలు తగ్గిన నేపథ్యంలో జనాలు మళ్ళీ థియేటర్లకు వస్తున్నారు. ఉన్నంతలో నాని మూవీనే బెస్టని భావించి దానికే ఓటు వేస్తున్నారు. ఈ వేడి చల్లరకూడదనే ఉద్దేశంతో నిన్న హైదరాబాద్ లో విజయ వేడుక నిర్వహించి మరోసారి తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఇవాళ విడుదలైన 35 చిన్న కథ కాదుకి మంచి స్పందన వస్తున్నా మాస్ సెంటర్స్ లో ప్రభావితం చేసేంత రేంజ్ ఉండకపోవచ్చనే టాక్ ఉంది. మల్టీప్లెక్సుల్లో రెస్పాన్స్ చాలా బాగుంది. జనక అయితే గనక తప్పుకోవడంతో దానికి రిజర్వ్ చేసిన స్క్రీన్లు కొన్ని నానికి తిరిగి వస్తున్నాయి.
వంద కోట్ల లాంఛనం ఎలాగూ అయిపోతోంది కాబట్టి నెక్స్ట్ టార్గెట్ నూటా యాభై అని మళ్ళీ చెప్పనక్కర్లేదు. వచ్చే వారం సెప్టెంబర్ 12, 13 తేదీల్లోనూ మరీ గొప్పగా చెప్పుకోదగ్గ రిలీజులు లేవు కనక సూర్య వర్సెస్ దయా పరుగు ఎక్కడ దాకా వెళ్తుందో చెప్పడం కష్టం. ఆగస్ట్ 29 రూపంలో మంచి డేట్ అందుకున్న నానికి వినాయకచవితితో పాటు నిమజ్జనం దాకా టైం కలిసి వచ్చేలా ఉంది. స్త్రీ 2 ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో బాగా తగ్గిపోయిన నేపథ్యంలో ఇంకో రెండు వారాలు సాలిడ్ రన్ దక్కడం ఖాయం. ఇంత విజయం సాధించింది కాబట్టే నిన్న ఎస్జె సూర్య షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని మరీ హైదరాబాద్ వచ్చి వాలాడు.
This post was last modified on September 6, 2024 1:48 pm
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…