తెలుగులోనూ మంచి మార్కెట్ ఉన్న కోలీవుడ్ స్టార్ విజయ్ ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం ఎల్లుండి విడుదల కాబోతోంది. లియో టైంలో కనిపించిన హడావిడి ఈసారి లేదు. నిన్న హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఊహించినట్టే విజయ్ రాలేదు కానీ దర్శకుడు వెంకట్ ప్రభు, హీరోయిన్ మీనాక్షి చౌదరితో పాటు మిగిలిన టీమ్ మొత్తం హాజరయ్యింది. పంపిణి హక్కులు తీసుకున్న మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ తరఫున శశి ఈ సినిమాకు ఏపీ తెలంగాణలో తెల్లవారుఝామున 4 గంటల ఆటల కోసం అనుమతులు అడిగామని, వస్తే కనక స్పెషల్ బెనిఫిట్ షోలు ఉంటాయని ప్రకటించారు.
ఇప్పటిదాకా ఇంత వేకువన విజయ్ సినిమాలకు స్పెషల్ షోలు వేసిన దాఖలాలు మన దగ్గర లేవు. కర్ణాటక, కేరళలో సహజమే కానీ ప్రభుత్వ నిబంధనల వల్ల తమిళనాడులోనూ ఏడు తర్వాత ప్రదర్శనలు ఉంటాయి. అయితే ఇంత ధైర్యంగా 4 గంటలకు ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం స్క్రీనింగ్ చేస్తామని చెప్పడం చూస్తుంటే కంటెంట్ మీద మేకర్స్ కు మాములు నమ్మకం కనిపించడం లేదు. నిద్రలు మానుకుని ఇంకా చీకటి ఉండగానే అభిమానులను, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే కెపాసిటీ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, తారక్, చరణ్, బన్నీ, ప్రభాస్ లాంటి స్టార్లకు మాత్రమే ఉంది.
ఇప్పుడీ లిస్టులో విజయ్ తోడు కావడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఒకవేళ సినిమా బాగుండి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఇదే ప్లస్ అవుతుంది. ఎలాగూ రెండు రోజుల్లో వినాయక చవితి పండగ ఉంటుంది కాబట్టి వరస సెలవులు కలిసి వస్తాయి. పోటీలో ఉన్న జనక అయితే గనక, 35 చిన్న కథ కాదు చిన్న బడ్జెట్ చిత్రాలు కావడం వల్ల పెద్దగా ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. కాకపోతే ఫిక్షన్, డీ ఏజింగ్, స్టైలిష్ యాక్షన్ లాంటి న్యూ ఏజ్ అంశాలు ఎక్కువగా ఉన్న ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం ఏ మేరకు మాస్ ఆడియన్స్ ని మెప్పిస్తుందనే దాని మీద బాక్సాఫీస్ ఫలితం ఆధారపడి ఉంటుంది.
This post was last modified on September 3, 2024 3:05 pm
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేదు. మహిళలపై నోరుపారేసుకునే నేతగా, స్త్రీలోలుడిగా ట్రంప్ నకు చెడ్డపేరుంది.…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…