సరిపోదా శనివారంతో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న నాని దర్శకుడు వివేక్ ఆత్రేయను ఎవరూ నమ్మనంతగా నమ్మి గొప్ప ఫలితాన్ని అందుకున్నాడు. మొదటి వారం తిరక్కుండానే అరవై కోట్లకు పైగా గ్రాస్ రావడమంటే మాటలు కాదు. అందులోనూ ఒకపక్క వరదలు, ఇంకోపక్క గబ్బర్ సింగ్ రీ రిలీజ్ తాకిడిని తట్టుకుంటూ భారీ నెంబర్లు నమోదు చేస్తోంది. తమిళనాడులోనూ మంచి ట్రెండ్ కనిపిస్తోంది. మాములుగా టాలీవుడ్ డబ్బింగ్ సినిమాలను అంతగా పట్టించుకోని అరవజనాలు ఈసారి నానితో పాటు ఎస్జె సూర్య విలనీని బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు వసూళ్లు చెబుతున్నాయి.
ఇదిలా ఉంటే నాని తర్వాతి వరసలో రెండు మూవీస్ ఉన్నాయి. మొదటిది హిట్ 3 ది థర్డ్ కేస్. శైలేష్ కొలను స్క్రిప్ట్ లాక్ చేసినట్టు సమాచారం. తరువాతది దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో. సికంద్రాబాద్ బ్యాక్ డ్రాప్ లో భారీ సెట్లు వేసి దీనికి పీరియాడిక్ సెటప్ ని సిద్ధం చేస్తున్నారు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ నెక్స్ట్ సినిమాలో వయొలెన్స్ ఎక్కువగా ఉంటుందని, చిన్న పిల్లలను అనుమతించడం కుదరదని తేల్చి చెప్పేశాడు. అది హిట్ 3నా లేక శ్రీకాంత్ ఓదెలదా అనే క్లారిటీ ఇవ్వలేదు కానీ ఇన్ సైడ్ టాక్ అయితే హిట్ 3 అనే వినిపిస్తోంది.
హిట్ 2లోనే నాని పోషించబోయే అర్జున్ సర్కార్ పాత్ర ఎంత క్రూరంగా ఉంటుందో హింట్ ఇచ్చారు. అంటే సైకోలు, విలన్లు చేసే హత్యలు కూడా అంతకు మించి అనేలా ఉంటాయన్న మాట. హిట్ 3 త్వరగా పూర్తి చేసే అవకాశం ఉండగా శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్టు మాత్రం ఎక్కువ సమయం డిమాండ్ చేసేలా ఉంది. ఏడాదికి రెండు రిలీజులు ఉండేలా చూసుకుంటున్న నాని 2024లో సరిపోదా శనివారంతో సరిపెట్టుకున్నాడు. కానీ వచ్చే ఏడాది మాత్రం అంతా ప్లానింగ్ ప్రకారం జరిగితే హిట్ 3ని త్వరగా విడుదలయ్యేలా చూసుకుని సంవత్సరం చివర్లో శ్రీకాంత్ ఓదెల సినిమాని తీసుకొచ్చే ఆలోచన ఉంది.
This post was last modified on September 2, 2024 6:02 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…