స్టేజ్ మీద నోరు జారడం.. ఆపై క్షమాపణ చెప్పడం.. ఈ మధ్య ఫిలిం సెలబ్రిటీలకు మాములు అయిపోయింది. టాలీవుడ్ లెజెండరీ నటుడు రాజేంద్ర ప్రసాద్.. గత రెండేళ్లలో చాలాసార్లు ఇలా అదుపు తప్పి మాట్లాడారు. కొన్ని సందర్భాల్లో క్షమాపణలు కూడా చెప్పారు. ఇప్పుడు మరోసారి ఆయన ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు.
తాజాగా తమిళ లెజెండరీ నటుడు ఎంజీఆర్ గురించి ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాకు టార్గెట్ అయ్యారు. తెలుగు దిగ్గజ నటుడు కాంతారావు చేసిన జానపద చిత్రాలు చూసి ఎంజీఆర్ భయపడ్డారంటూ అసభ్య పదజాలంతో ఒక వేడుకలో రాజేంద్రప్రసాద్ మాట్లాడడం వివాదాస్పదమైంది. ఆయన మాట్లాడింది తెలుగులోనే అయినా.. సోషల్ మీడియా కాలం కావడంతో తమిళ జనాలకు విషయం చేరింది.
వాళ్ళు ఎంజీఆర్ ను దేవుడిలాగే చూస్తారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ మీద తీవ్ర విమర్శలు తప్పలేదు. తెలుగు వాడే అయిన తమిళ హీరో విశాల్.. రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పాలంటూ సోషల్ మీడియాలో పోస్టు కూడా పెట్టాడు. ఈ నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. క్షమాపణ చెప్తూ వీడియో రిలీజ్ చేశారు.
ఎంజీఆర్ తమిళ సినిమాకు దేవుడు అంటూ మాట్లాడిన రాజేంద్ర ప్రసాద్.. తమిళ జనాలు ఆయన్ని ఎలా చూస్తారో తనకు తెలుసన్నారు. ఎంజీఆర్ మీద తనకు అపారమైన గౌరవం ఉందని చెప్పారు. తనకు కాంతారావు అవార్డ్ ఇచ్చిన సందర్భంగా ఆయన గొప్పదనం గురించి చెప్పే క్రమంలో కొంచెం మిస్ అయి ఎంజీఆర్ గురించి ఒక మాట అనేసినట్లు చెప్పారు. దాన్ని కొందరు కావాలనే వివాదాస్పదం చేశారని రాజేంద్ర ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.
తాను మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో చదువుకునేటప్పుడు ఎంజీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారని.. తమ ఇన్స్టిట్యూట్ కూడా వచ్చి తమ పెర్ఫార్మెన్స్ చూశారని ఆయన గుర్తు చేసుకున్నారు. అలాంటి వ్యక్తి గురించి తాను తప్పు మాట్లాడేంత సాహసం చేస్తానా అని రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు.
ఈసారికి పొరపాటు అయిందని.. ఎవరి మనసులనైనా నొప్పించి ఉంటే క్షమాపణ చెప్తున్నానని. ఇకపై తాను ఎప్పుడూ ఇలా మాట్లాడనని.. ఇంతటితో ఈ విషయాన్ని వదిలేయాలని రాజేంద్ర ప్రసాద్ కోరారు. ఈ వీడియో మొత్తం ఆయన తమిళంలోనే మాట్లాడి నేరుగా తమిళులకు సారీ చెప్పారు.
This post was last modified on March 13, 2026 3:47 pm
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…