ఇటీవలి కొన్ని పరిణామాలతో ‘పుష్ప-2’ సినిమా మీద సోషల్ మీడియాలో ఎంతో నెగెటివిటీ కనిపిస్తోంది. అందుకు ప్రధాన కారణం.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతుదా హీరో అల్లు అర్జున్ ప్రచారం చేయడమే. ఈ విషయంగా మెగా ఫ్యాన్స్, జనసైనికులు బాగా హర్ట్ అయ్యారు.
ఇంతకుముందే మెగా అభిమానుల్లో ఓ వర్గానికి అల్లు అర్జున్ అంటే పడట్లేదు. చాన్నాళ్లుగా అతడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇటీవలి పరిణామాలతో వాళ్లలో నెగెటివిటీ ఇంకా పెరిగిపోయింది. పుష్ప-2 ఎలా ఆడుతుందో చూస్తామంటూ ఆ సినిమాను టార్గెట్ చేయబోతున్న సంకేతాలు ఇస్తున్నారు. ఇలాంటి సమయంలోనే జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్.. బన్నీని విమర్శించడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో మెగా అభిమానులు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య గొడవలు ఇంకా పెరిగాయి.
ఈ గొడవలు, నెగెటివిటీ పుష్ప-2 మీద ప్రతికూల ప్రభావం చూపుతాయేమో అన్న సందేహాలు నెలకొన్నాయి. కానీ ఇదంతా పెద్ద విషయం కాదని అంటున్నాడు ‘పుష్ప-2’ నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ యలమంచిలి. తమ బేనర్లో తెరకెక్కిన కొత్త చిత్రం ‘మత్తు వదలరా-2’కు సంబంధించిన ప్రెస్ మీట్లో ‘పుష్ప-2’ మీద నెలకొన్న నెగెటివిటీ గురించి ఆయన మాట్లాడారు.
“ఆ సినిమా గురించి విడుదలకు ముందు ఎవరైనా ఏదైనా నెగెటివ్‌గా మాట్లాడుతున్నారేమో. కానీ రిలీజ్ టైంకి ఇవేవీ ఉండవు అనుకుంటున్నా. సినిమా బాగుంటే అందరూ చూస్తారు. దాని గురించి మంచిగానే మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఎవరైనా ఏదైనా అనొచ్చు. కానీ మెగా ఫ్యామిలీలో అందరూ ఒక్కటే. ఎవరి మధ్య గొడవలు లాంటివేమీ ఉండవు. ఫ్యామిలీ అంతా ఒక్కటే. సినిమా మీద కూడా రిలీజ్ టైంకి ఎలాంటి నెగెటివిటీ ఉండదనుకుంటున్నా” అని రవిశంకర్ స్పష్టం చేశారు.
This post was last modified on August 30, 2024 6:23 pm
ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…
మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…
ఏపీలో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో సంక్రాంతి వేడుకలు జరిగాయి.…
చాలా ఏళ్ల నుంచి నాసిరకం సినిమాలు తీస్తూ తనకున్న గొప్ప పేరునంతా పోగొట్టుకుని దర్శకుడిగా జీరో అయిపోయాడు రామ్ గోపాల్…