గేమ్ ఛేంజర్ డిసెంబర్ విడుదలని దిల్ రాజు సందర్భం వచ్చిన ప్రతిసారి నొక్కి వక్కాణిస్తున్నారు కానీ ఆ డేట్ ఒక్కటి అఫీషియల్ గా ప్రకటించాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 20 అనే సమాచారం డిస్ట్రిబ్యూటర్లకు అనధికారికంగా వెళ్లిపోయినా దర్శకుడు శంకర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే టీజర్ తో పాటు దాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. డిసెంబర్ 6 పుష్ప 2 ది రూల్ కు దీనికి మధ్య కేవలం రెండు వారాలే గ్యాప్ వచ్చేలా ఉన్నా ప్లానింగ్ లో మాత్రం ఎలాంటి మార్పు ఉండటం లేదు. దీన్ని కాసేపు పక్కన పెడితే గేమ్ ఛేంజర్ కు సంబంధించిన ఒక టెన్షన్ తగ్గింది.
అదేంటంటే ఇప్పటిదాకా క్రిస్మస్ రేస్ లో ఉన్న అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ పోటీ నుంచి తప్పుకున్నట్టు ముంబై టాక్. నవంబర్ లోపు షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ రెండూ పూర్తి చేయడం అసాధ్యమని తేలడంతో హడావిడిగా రావడం కన్నా నెమ్మదిగా రిలీజ్ చేద్దామనే నిర్ణయానికి అమీర్ వచ్చారట. దీంతో చరణ్ కు ఊరట దక్కనుంది. ఎందుకంటే ఇప్పటికే ఓవర్సీస్ లో ముఫాసా ది లయన్ కింగ్ వల్ల థియేటర్ల సమస్య వచ్చేలా ఉంది. ఒకవేళ అమీర్ కూడా ఉంటే ఇబ్బంది ఎక్కువవుతుంది. సో ఇప్పుడు తను డ్రాప్ కావడం వల్ల సితారేకు ప్లాన్ చేసుకున్న స్క్రీన్లు గేమ్ ఛేంజర్ లాగేసుకోవచ్చు.
అలా అని హిందీలో కాంపిటీషన్ లేదని కాదు. తేరి రీమేక్ బేబీ జాన్ డిసెంబర్ 25 వస్తుంది. దీన్నే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. అజిత్ విదయముయార్చి సైతం ఇదే డేట్ వైపు చూస్తోందట. ఏదైతేనేం వీలైనంత త్వరగా గేమ్ ఛేంజర్ బృందం విడుదల తేదీని బ్లాక్ చేసుకోవడం ఉత్తమం. ప్రెస్ మీట్స్ లో, మీడియా ముందు క్రిస్మస్ అని చెప్పడం వేరు, ఒక పోస్టర్ లేదా వీడియో ద్వారా ఫలానా డేటని ప్రకటించడం వేరు. మెగాభిమానులు ఎదురు చూస్తోంది రెండో దాని కోసమే. రామ్ చరణ్ భాగం కొంత రీ షూట్ చేయబోతున్నారన్న వార్తలో ఎలాంటి నిజం లేదు.
This post was last modified on August 28, 2024 4:25 pm
ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు అద్భుత సందేశం ఇచ్చారు. తనను అభిమానిం చేవారు... తప్పకుండా పాటించాలని…
ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…
ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి…
ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…