ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక సినిమాల గురించే ఆలోచించే పరిస్థితి మూడు నెలల దాకా చూడలేకపోయిన పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు పెండింగ్ లో ఉన్న దర్శక నిర్మాతలను కలుస్తున్నారు. షూటింగులు, బాలన్స్ వర్క్, విడుదల తేదీలు తదితర వ్యవహారాలకు సంబంధించి సమాచారం తీసుకుంటున్నారు. మొదటి ప్రాధాన్య క్రమంలో ఓజి, హరిహర వీరమల్లు ఉండగా చివరిదైన ఉస్తాద్ భగత్ సింగ్ కోసం దర్శకుడు హరీష్ శంకర్ ఇటీవలే పవన్ ను కలిసి చర్చించారు. ఎప్పుడు రీ స్టార్ట్ చేస్తారనేది పక్కనపెడితే ఇంకా ఎనభై శాతం కంటెంట్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్నున్నాయి.
ఎన్నికలకు ముందు పవర్ స్టార్ కి ఇప్పటి పవన్ కు ఇమేజ్ పరంగా మార్పులొచ్చాయి. ఎంత సినిమా అయినా సరే ఒక స్థాయిని మైంటైన్ చేయాల్సి ఉంటుంది. అవకాశం కోసం ఎదురు చూసే ప్రతిపక్షాలు ఏదైనా తప్పు దొరికితే వాడుకోవడానికి సిద్ధంగా ఉంటాయి. ట్రోలింగ్ కి దారులు తెరుస్తాయి. ఉదాహరణకు మిస్టర్ బచ్చన్ లో రవితేజతో ఎలాంటి కామెడీ, డాన్సులు చేయించినా చెల్లిపోయింది కానీ పవన్ తో అలాంటివి కుదరదు. కెవ్వు కేక లాంటి ఊర మాస్ ఐటెం సాంగ్స్ సైతం కష్టమే. అలాని ఆర్ట్ ఫిలిం లాగా తీయాలని కాదు కానీ సోషల్ మీడియా ప్రపంచంలో జాగ్రత్తగా ఉండాల్సిందే.
అసలే హరీష్ శంకర్ ట్విట్టర్ తదితర సామజిక మాధ్యమాల్లో బలంగా టార్గెట్ అయ్యాడు. ఇప్పుడీ ఉస్తాద్ భగత్ సింగ్ బంగారం లాంటి ఛాన్స్. తన మీద పడ్డ మరకను పూర్తిగా తుడుచుకునే అవకాశం. ఇంకా తగినంత సమయం ఉంది కాబట్టి ఈలోగా మరోసారి స్క్రిప్ట్ ని విశ్లేషించుకుంటే బెటరని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన కాంబినేషన్ కావడంతో ఎంత రీమేక్ అయినా సరే అంచనాలు ఖచ్చితంగా పై రేంజులోనే ఉంటాయి. పవన్ మాత్రం మిస్టర్ బచ్చన్ ఫలితాన్ని పట్టించుకునే స్థితిలో లేరు. మాట ఇచ్చారు కాబట్టి ఉస్తాద్ ని పూర్తి చేయాల్సిందే.
This post was last modified on August 27, 2024 11:41 pm
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్‌లో జరిగిన ఈ టోర్నీ…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…