Movie News

సందీప్ రెడ్డి.. రెండు సినిమాలు-నాలుగేళ్లు

అర్జున్ రెడ్డి అనే ఒకే ఒక్క సినిమాతో హాట్ షాట్ డైరెక్టర్‌గా మారిపోయాడు సందీప్ రెడ్డి వంగ. ‘అర్జున్ రెడ్డి’తో తెలుగులో సెన్సేషన్ క్రియేట్ చేశాక అదే కథను ‘కబీర్ సింగ్’గా హిందీలో రీమేక్ చేసి అక్కడా సంచలనాలక తెర తీశాడు. ఇక తర్వాతి చిత్రం ‘యానిమల్’తో సందీప్ రేపిన ప్రకంపనల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాను విమర్శించిన వాళ్లూ లేకపోలేదు కానీ.. దాని బాక్సాఫీస్ విజయం మాత్రం అసామాన్యం.

దీని తర్వాత సందీప్ ఏ సినిమా చేస్తాడనే విషయంలో కొంత సందిగ్ధత నెలకొంది. ఈ విషయంలో రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. కాగా తాజాగా సందీప్ ఓ కాలేజ్ ఈవెంట్లో పాల్గొన్న సందర్భంగా తన లైనప్ గురించి క్లారిటీ ఇచ్చాడు. వచ్చే నాలుగేళ్లను తాను రెండు సినిమాల కోసం కేటాయిస్తున్నట్లు ప్రకటించాడు.

ప్రస్తుతం ప్రభాస్‌తో చేయాల్సిన ‘స్పిరిట్’ మూవీ కోసం ప్రి ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైనట్లు సందీప్ వెల్లడించాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మొదలుపెడతానని.. ఇది రిలీజ్ కావడానికి రెండేళ్లు పడుతుందని సందీప్ వెల్లడించాడు. ఆ తర్వాత తాను రణబీర్ కపూర్‌తో ‘యానిమల్’ సీక్వెల్  ‘యానిమల్ పార్క్’ తీస్తానని.. దాని కోసం రెండేళ్లు కేటాయిస్తానని సందీప్ చెప్పాడు. ఇలా వచ్చే నాలుగేళ్లు ఈ రెండు చిత్రాలకే అంకితం కానున్నట్లు సందీప్ చెప్పాడు.

కాబట్టి స్పిరిట్ ముందా, యానిమల్ పార్క్ ముందా.. ఇవి కాక సందీప్ వేరే హీరో ఎవరితో అయినా జట్టు కడతాడా అనే విషయంలో ఇక ఊహాగానాలన్నింటికీ తెరపడినట్లే. ప్రస్తుతం ప్రభాస్.. హను రాఘవపూడి సినిమాను మొదలు పెట్టాడు. దాంతో పాటు ‘రాజా సాబ్’ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. అవి ఒక కొలిక్కి వచ్చాక సందీప్ సినిమాను మొదలు పెడతాడన్నమాట.

This post was last modified on August 27, 2024 10:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

7 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

10 hours ago