బలగంతో ప్రొడక్షన్ డెబ్యూ చేసిన దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి వస్తున్న మూడో సినిమా జనక అయితే గనక. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిన్న సినిమాలకు ప్రాధాన్యం ఇస్తామని నిర్మాత హన్షిత రెడ్డి ఆలోచనలకు అనుగుణంగానే ఇది రూపొందిందని ప్రమోషన్ కంటెంట్ చూస్తేనే అర్థమవుతోంది. విజయ్ ది గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైం లాంటి పెద్ద పోటీ ఉన్నా సరే సెప్టెంబర్ 6 విడుదలకు రెడీ అవుతున్న ఈ కామెడీ ఎంటర్ టైనర్ ట్రైలర్ ఇవాళ రిలీజ్ చేశారు. కథను దాచకుండా ముందే చెప్పేసే ట్రెండ్ ని ఫాలో అవుతూ జనక అయితే గనక మేకర్స్ కూడా తామేం చూపించబోతున్నారో క్లారిటీ ఇచ్చేశారు.
వాషింగ్ మెషీన్ కంపెనీలో పని చేసే ఓ కుర్రాడి (సుహాస్) ది సగటు మధ్యతరగతి మనస్తత్వం. అందమైన భార్య (సంగీర్తన) తో కాపురం సవ్యంగా సాగుతున్నా పిల్లలు వద్దని ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. తల్లి తండ్రులు, బామ్మ ఎంత పోరు పెట్టినా పట్టించుకోడు. అయితే ఓసారి సతీమణి నెల తప్పుతుంది. దీంతో షాక్ తిన్న సదరు భర్త వెంటనే స్నేహితుడైన లాయర్ (వెన్నెల కిషోర్) ద్వారా కండోమ్ కంపెనీ మీద కేసు వేస్తాడు. వినగానే జడ్జ్ సైతం పగలబడి నవ్వే ఇలాంటి విచిత్రమైన కేసుకు సంబంధించిన పరిణామాలు సమాజంలో హాట్ టాపిక్ గా మారతాయి.
దర్శకుడు సందీప్ బండ్ల తీసుకున్న పాయింట్ వెరైటీగా ఉంది. గోపాల గోపాలలో దేవుడి మీద కేసు వేస్తే ఇక్కడ కండోమ్ సంస్థ మీద పెట్టడం కొత్త ఆలోచన. సుహాస్ టైమింగ్, గోపరాజు రమణ వెన్నెల కిషోర్ లాంటి ఆర్టిస్టుల హాస్యం, హోమ్లీ కామెడీ వెరసి జనక అయితే గనకలో నవ్వించడంతో పాటు ఆలోచించడమనే కాన్సెప్ట్ ని తీసుకున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూర్చగా సాయి శ్రీరామ్ ఛాయాగ్రహణ బాధ్యతలు తీసుకున్నారు. రాజేంద్రప్రసాద్ ప్రత్యేక పాత్ర పోషించిన ఈ ఎంటర్ టైనర్ ఇంకో పది రోజుల్లో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో పబ్లిసిటీ స్పీడ్ పెంచబోతున్నారు.
This post was last modified on August 27, 2024 8:30 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…