విజయ్ దేవరకొండ ఏది చేసినా, ఏమి మాట్లాడినా కానీ ఎదో ఒక సంచలనం ఉండాలని అనుకుంటాడో, లేక అలా జరిగిపోతుందో కానీ… లాక్ డౌన్ వేళ తనకి కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయని, ప్రొఫెషన్ మారిపోతే ఎలా ఉంటుంది అనిపిస్తోందని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
ఛెఫ్ అయి వంటలు చేస్తే ఎలా ఉంటుందా, గన్ పట్టుకుని ఆర్మీలో చేరిపోతే ఎలా ఉంటుందో, లేదా కార్/బైక్ రేసింగ్ లోకి వెళ్తే ఎలా ఉంటుందా అంటూ ఆలోచనలు సాగుతున్నాయని చెప్పాడు. లాక్ డౌన్ తర్వాత కొన్ని రోజులు బ్రెయిన్ ఆఫ్ చేసేసి ఏమీ ఆలోచించలేదని, మళ్ళీ ఇప్పుడు నార్మల్ గా పని చేస్తుందని చెప్పాడు.
అలాగే గత రెండేళ్లుగా కంటి నిండా నిద్ర పోలేదని, ఆ బాలన్స్ అంతా ఇప్పుడు పడుకుంటున్నానని, ఇప్పుడు తను తొమ్మిది, పది గంటలు పడుకున్నా అడిగే వాళ్ళు లేరని విజయ్ చెప్పాడు. ప్రస్తుతం దేవరకొండ ఫౌండేషన్ పనులు ముమ్మరం చేసి లాక్ డౌన్ వేళ వీలైనంత మంది మిడిల్ క్లాస్ వాళ్ళకి సాయం చేసే యోచనలో ఉన్నాడు.
This post was last modified on April 28, 2020 3:42 am
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…