Movie News

మెగా ఫ్యాన్స్ VS అల్లు ఆర్మీ – ఇంకెంత దూరం

ఏపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అల్లు అర్జున్ తనస్నేహితుడు శిల్పా రవిచంద్రరెడ్డి కోసం నంద్యాల వెళ్లి వైసిపికి ప్రచారం చేయడం దుమారం రేపి నెలలు గడుస్తున్నా దాని తాలూకు సెగలు ఎప్పటికప్పుడు పెద్దవుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఆర్మీ పరస్పర కామెంట్లు, దూషణలు, ట్రోలింగ్ చేసుకుంటున్నారు. తాజాగా ప్రజా ప్రతినిధులు సైతం తోడవ్వడంతో వ్యవహారం ఎక్కడిదాకా వెళ్తుందో అంతు చిక్కడం లేదు. జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శీను చేసిన కామెంట్లు ఇప్పుడు సర్వత్రా హాట్ టాపిక్ గా మారాయి. ఒక్కసారిగా వీడియో తెగ వైరలైపోతోంది.

ప్రత్యేకంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారని తనకు తెలియదని, అందరూ మెగాభిమానులే తప్ప ప్రత్యేకంగా షామియానా, టెంట్లు పెట్టుకున్న వాళ్ళ గురించి తనకు తెలియదని శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసేలా ఉన్నాయి. చిరు, పవన్, చరణ్ ఇలా అందరిని నీలో కూడా చూసుకుని ఆదరిస్తున్నారని, ప్రచారం చేసిన చోట ఓడిపోయి, తండ్రిని ఎంపీగా గెలిపించలేని నువ్వు సపోర్ట్ చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే అంటూ అన్న మాటలు చాలా దూరం వెళ్లేలా ఉన్నాయి. నిజానిజాలు పక్కపెడితే సున్నితమైన ఈ ఇష్యూ కాస్తా క్రమంగా రూపం మార్చుకుంటున్న మాట వాస్తవం.

ఇటీవలే మారుతినగర్ సుబ్రహ్మణ్యం ఈవెంట్ లో బన్నీ అన్న మాటలే చిచ్చుని మరింత రాజేశాయి. స్నేహితుల కోసం ఏమైనా చేస్తానని ఎంత దూరమైనా వెళ్తానని అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ మెగా ఫ్యాన్స్ కి బాగా రెచ్చగొట్టేలా చేశాయి. ఇంద్ర రీ రిలీజ్ చూస్తూ సినిమాలో చిరంజీవిని మోసం చేసే ఒక పాత్రకి అన్వయించే దాకా పరిస్థితి వెళ్ళింది. కొందరైతే ఏకంగా పుష్ప 2ని డిసెంబర్లో  బ్యాన్ చేస్తామని కూడా అంటున్నారు. దీనికి చెక్ ఎలా పడుతుందో అర్థం కాక తటస్థంగా ఉండే సినీ ప్రియులు అయోమయం చెందుతున్నారు. చిరు, అల్లు కుటుంబాల నుంచి ఎవరైనా ఇరువురి ఫ్యాన్స్ కోసం పెద్దరికం వహించి క్లారిటీ ఇస్తే మేలేమో. 

This post was last modified on August 27, 2024 8:03 pm

Share

Recent Posts

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

3 minutes ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

12 minutes ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

2 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

3 hours ago

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

4 hours ago

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

4 hours ago