వచ్చే వారం విడుదల కాబోతున్న సరిపోదా శనివారంకి టైటిల్ కు తగ్గట్టే అన్నీ ఒక్కొక్కటిగా సరిపోయేలా సమకూరుతున్నాయి. ట్రైలర్ తర్వాత వచ్చిన హైప్ ని హీరో నాని తనదైన శైలిలో దక్షిణాది రాష్ట్రాలన్నీ తిరిగి ప్రమోట్ చేసి పెంచేశాడు. ప్రభాస్ మీద కామెంట్ చేసిన అర్షద్ వార్సీ మీద చురక వేసినందుకు ఒక వర్గం బాలీవుడ్ మీడియా ఉద్దేశపూర్వకంగా హిందీ డబ్బింగ్ వెర్షన్ మీద నెగటివ్ చేయాలని చూస్తున్నా అదేమీ పని చేయడం లేదని సోషల్ మీడియా ట్రెండ్స్ స్పష్టం చేస్తున్నాయి. స్త్రీ 2 హ్యాంగోవర్ లో ఉన్న నార్త్ ఆడియన్స్ క్రమంగా దీని వైపు చూడటం మొదలుపెట్టారు.
తమిళ మీడియా మద్దతుతో కోలీవుడ్ లో అంచనాలు రేపడంలో నాని సక్సెసయ్యాడు. ముఖ్యంగా ప్రియాంక మోహన్, ఎస్జె సూర్యలను అంటిపెట్టుకుని మరీ పబ్లిసిటీలో భాగం చేయడం ఫలితాన్ని ఇస్తోంది. కేరళలో అదితి మోహన్ ఆ బాధ్యతను తీసుకోగా ముంబైలో చేయబోయే ఈవెంట్స్ కి టీమ్ మొత్తం ఏకమయ్యింది. ఆగస్ట్ 29 ఎంత మంచి డేటో క్రమంగా అర్థమవుతోంది. నిర్మాత డివివి దానయ్య నైజాం హక్కులను దిల్ రాజుకి ఇవ్వడం ద్వారా భారీ రిలీజ్ కు మార్గం సుగమం చేసుకున్నారు. నాని కెరీర్ లోనే అత్యధిక తెలంగాణ స్క్రీన్లలో సరిపోదా శనివారం అడుగుపెట్టనుంది.
ఇక మిగిలింది హిట్ టాక్ తెచ్చుకోవడం. దర్శకుడు వివేక్ ఆత్రేయ ఈసారి డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతున్న వైనం కనిపిస్తోంది. రెగ్యులర్ ఫార్ములాలో కాకుండా ఒక రోజు మాత్రమే హీరోకి కోపం వచ్చే పాయింట్ ని చెడ్డవాడైన పోలీస్ ఆఫీసర్ కి ముడిపెట్టిన తీరు ఆసక్తికరంగా ఉంది. ఆగస్ట్ 15 రిలీజైన వాటిలో ఆయ్ మినహాయిస్తే అన్నీ నిరాశ పరిచిన నేపథ్యంలో సరిపోదా శనివారం మీద బయ్యర్ వర్గాల్లో మాములు అంచనాలు లేవు. పైగా ఆపై వారం కూడా స్టార్ హీరోలెవరూ రావడం లేదు. సో టాక్ రావడం ఆలస్యం దిల్ రాజు అన్నట్టు దసరా రికార్డులను బద్దలు కొట్టడం లాంఛనమే అవుతుంది.
This post was last modified on August 22, 2024 6:13 pm
కొందరు దర్శకులు టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…
నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ…
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…