మొన్న ఆగస్ట్ పదిహేను వచ్చిన రెండు భారీ కమర్షియల్ సినిమాలు తీవ్రంగా నిరాశ పరచడం అభిమానులను కలవరానికి గురి చేయగా, ట్రేడ్ వర్గాలు ఆ షాక్ నుంచి కోలుకోవడానికి టైం పట్టేలా ఉంది. అయితే ఇలాంటి కంటెంట్లు ఇప్పుడు జనాలు చూడటం లేదేమోననే అనుమానం ఇండస్ట్రీలో లేకపోలేదు. సరిపోదా శనివారం ప్రెస్ మీట్ సందర్భంగా నాని దీనికి సంబంధించి ఒక మంచి నిర్వచనం ఇచ్చాడు. ప్రేక్షకులను ఎప్పుడైతే ఎంగేజ్ చేయడంలో విఫలమవుతామో అది ఫ్లాప్ రూపంలో ప్రతిబింబిస్తుంది తప్ప కథలకు కాలం చెల్లడం లాంటివి ఉండవని వివరణ ఇచ్చాడు.
ఇరవై ఏళ్ళ క్రితం వచ్చిన కమర్షియల్ కథలను స్ఫూర్తిగా తీసుకుని ఇప్పుడు బ్లాక్ బస్టర్లు తీస్తున్న దర్శకులను చూస్తున్నాం కనక అన్ని అంశాలు సరైన స్థానంలో, సరైన రీతిలో కనక కూర్చుకుంటే ఖచ్చితంగా హిట్ అవుతాయని అన్నాడు. నాని చెప్పింది అక్షర సత్యం. ఎందుకంటే మాస్ ఆడియన్స్ అంచనాలు ఎన్ని దశాబ్దాలు గడిచినా ఒక మీటర్ లో ఉంటాయి. వాటిని అందుకోవడానికి నాలుగు ఫైట్లు, అయిదు పాటలు పెట్టేస్తే సరిపోదు. భలే తీశాడురా అనిపించాలి. మళ్ళీ ఇంకోసారి చూసేందుకు థియేటర్ కు వెళ్లాలని ఫిక్సవ్వాలి. అదే మాస్ మూవీని బ్లాక్ బస్టర్ స్థాయికి తీసుకెళ్తుంది.
ఇంత ప్రాక్టికల్ గా ఆలోచించడం వల్లే నాని సక్సెస్ రేట్ బాగా పెరుగుతోంది. దసరాతో ఊర మాస్ ట్రై చేసినా, హాయ్ నాన్నతో ఎమోషనల్ జానర్ కు వెళ్లినా విజయం వెంటే ఉంది. సరిపోదా శనివారంకొచ్చిన హైప్ కూడా ట్రైలర్ లో చూపించిన యాక్షన్ కంటెంట్ వల్లే. అంటే సుందరానికి అంచనాలు అందుకోలేకపోవడం గురించి ఓపెన్ గా నిజాలు మాట్లాడిన నాని ఇప్పుడు చెప్పిన కమర్షియల్ డెఫినెషన్ అక్షరాలా పాటించదగ్గది. ఆగస్ట్ 29 విడుదల కాబోతున్న సరిపోదా శనివారం ఖచ్చితంగా మెప్పిస్తుందనే నమ్మకం టీమ్ లో ఉన్న ప్రతిఒక్కరిలో కనిపిస్తోంది. నిజమవ్వాలనే అందరి ఆకాంక్ష.
This post was last modified on August 21, 2024 5:25 pm
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…
తిరుమల తొక్కిసలాట ఘటనపై శుక్రవారం సాయంత్రం టీటీడీ అత్యవసరంగా భేటీ అయి సమీక్షించింది. ఈ సమావేశంలో భాగంగా మృతుల కుటుంబాలకు…