ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న రామ్ చరణ్ ఇవాళ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆవిష్కరణలో పాల్గొన్నాక దాంతో దిగిన ఫోటోని అక్కడి క్రికెట్ బోర్డు ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్ట్ చేసింది. ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ తనను ఉద్దేశించి బాలీవుడ్ మెగాస్టార్ ట్యాగ్ పెట్టేయడంతో ఒక్కసారిగా వైరలైపోయింది. 8 లక్షలకు పైగా ఫాలోయర్లు ఉన్న ఆ పేజీలో పోస్టులకు ఎప్పుడూ పదులు లేదా మహా అయితే వందల్లో మాత్రమే లైకులు కామెంట్లు ఉంటాయి. కానీ ఇది చరణ్ ట్వీట్ కావడంతో పధ్నాలుగు వేల లైకులు, నాలుగున్నర వేల రీ ట్వీట్లు పడ్డాయి. దానికి కారణం బాలీవుడ్ అనే ఉపమానం.
నిజానికి రామ్ చరణ్ బాలీవుడ్ కు సంబంధించిన వాడు కాదు. తెలుగు సొత్తు. లేదూ అంటే ఇండియన్ సినిమా ప్రతినిధిగా చెప్పొచ్చు. కానీ ప్రత్యేకంగా ముంబైకి చెందిన హీరో అని అర్థం వచ్చేలా క్రికెట్ ఆస్ట్రేలియా ట్వీట్ చేయడంతో ఈ చర్చ జరిగింది. అయినా చాలా దేశాల్లో ఒకప్పుడు భారతీయ సినిమా అంటే కేవలం హిందీనే అనుకునేవాళ్ళు. మనకు ఓవర్సీస్ సైతం అందని ద్రాక్షగా ఉండేది. 90 దశకంలో షారుఖ్, సల్మాన్ చిత్రాలు యుఎస్ లో రిలీజైన టైంలోనూ ఆంధ్రా ఎన్ఆర్ఐలు హోమ్ ఎంటర్ టైన్మెంట్ లో తప్ప థియేటర్ లో తెలుగు సినిమా చూసే ఛాన్స్ దక్కేది కాదు.
ఇప్పుడు లెక్కలు మారాయి. రాజమౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి వంగా, త్రివిక్రమ్ లాంటి వాళ్ళు ట్రెండ్ మార్చేశారు. సాధ్యం కాదేమో అనుకున్న ఫిగర్లను చేసి చూపిస్తున్నారు. మనం బాలీవుడ్ ని డామినేట్ చేయడం నాలుగైదు సంవత్సరాల క్రితమే మొదలైపోయింది. కాకపోతే ఇంటర్నేషనల్ మీడియాకి ఇదింకా అర్థం కావాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ కు వచ్చిన గ్లోబల్ రీచ్ వల్ల చరణ్, తారక్ జపాన్ లాంటి దేశాల్లోనూ విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కాకపోతే టాలీవుడ్ అనే పదాన్ని ఎక్కువ హైలైట్ చేయకపోవడం వల్ల ఇలా పొరపాటున బాలీవుడ్ నుంచి వచ్చిన వాళ్ళుగా పరిగణించబడాల్సి వస్తోంది.
This post was last modified on August 19, 2024 9:41 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…