ఇప్పుడున్న హీరోయిన్లకు ఒక పెద్ద ప్యాన్ ఇండియా మూవీ అందులోనూ పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఉన్న పాత్ర దొరికితే పెద్ద అదృష్టం. అలాంటిది రెండు క్రేజీ ఆఫర్లు పట్టేసి వాటిని ఒకే రోజు విడుదల చూసే ఛాన్స్ దక్కడం మాత్రం అరుదు. రష్మిక మందన్న దానికి నోచుకుంది. డిసెంబర్ 6న పుష్ప 2 ది రూల్ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగవంతం చేస్తున్నారు. పుకార్లు ఏవో వినిపిస్తున్నప్పటికీ దర్శకుడు సుకుమార్ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి డెడ్ లైన్ మిస్ కాకూడదనే లక్ష్యంతో పని చేస్తున్నారు. సో డౌట్లు అక్కర్లేదు.
అదే డిసెంబర్ 6న రష్మిక మరో ప్రతిష్టాత్మక చిత్రం చావా రాబోతోంది. ఛత్రపతి శివాజీ కథ ఆధారంగా భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ హిస్టారికల్ మూవీలో విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్నాడు. చారిత్రాత్మక నేపథ్యం కావడంతో రష్మికకు నటన పరంగా చాలా పెద్ద అవకాశంగా చెబుతున్నారు. యానిమల్ తర్వాత నార్త్ లోనూ రష్మిక క్రేజ్ పెరిగిపోయింది. పుష్పతోనే ఇది జరిగినప్పటికీ సందీప్ వంగా దృష్టిలో పడ్డాక ఫాలోయింగ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అంతకు ముందే గుడ్ బై, మిషన్ మజ్ను లాంటి సినిమాలు చేసినా అసలైన బ్రేక్ దక్కింది మాత్రం యానిమల్ నుంచే. ఇప్పుడీ డబుల్ ధమాకా రెడీ అవుతోంది.
గతంలో బాలకృష్ణ, నాని లాంటి అగ్ర హీరోలతో పాటు విజయశాంతి లాంటి సీనియర్ కథానాయికలు కొందరు ఒకే రోజు రెండు సినిమాల రిలీజ్ ఫీట్ సాధించారు. తర్వాత మళ్ళీ ఎవరికి కుదరలేదు. ముఖ్యంగా ఇప్పటి జనేరేషన్ స్టార్లకు అస్సలు సాధ్యం కాదు. అయినా సరే రష్మిక మందన్న ఈ ఘనత అందుకోవడం విశేషం. హైప్ పరంగా రెండింటి మీద అంచనాలు భారీగా ఉండబోతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, కోల్కతా తదితర చోట్ల చావా ఇచ్చే కాంపిటీషన్ మాములుగా ఉండదు. ఇక పుష్ప 2 గురించి తెలిసిందే. ఇప్పటికిప్పుడు వదిలినా థియేటర్లు కలెక్షన్లతో మోతెక్కిపోపోవడం ఖాయం.
This post was last modified on August 19, 2024 5:13 pm
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…