నిర్మాత బన్నీ వాస్, హీరో అల్లు అర్జున్ మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ గురించి అందరికీ తెలిసిన విషయమే అయినా దాంట్లో ఎంత ఘాడత ఉందో అవగాహన ఉన్నది మాత్రం కొందరికే. నిజానికి వాస్ అసలు పేరు ఉదయ శ్రీనివాస్ గవర.
తనకు అంతా తానై నిలిచిన ఫ్రెండ్ ని ఎంత అభిమానిస్తాడో చెప్పేందుకు రుజువుగా అన్నట్టుగా ఇంటి పేరు కాస్తా బన్నీ అయిపోయింది. ఈ బంధం రెండు దశాబ్దాలకు పైబడినది. ఇటీవలే వైసిపి అభ్యర్థి ప్రచారం కోసం అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళినప్పుడు జనసేనలో ఉన్న బన్నీ వాస్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడనే వార్త కొన్ని వారాల క్రితం బలంగా తిరిగింది.
సందర్భం వచ్చిన ప్రతిసారి బన్నీ వాస్ వీటికి క్లారిటీ ఇస్తూనే వచ్చాడు. తాజాగా ఆయ్ ఈవెంట్ లోనూ మరోసారి కుండబద్దలు కొట్టేశారు. తనకు అవసరం వచ్చిన ప్రతిసారి, అడగకుండానే ఏం కావాలో చూసి మరీ సమకూరుస్తాడని, జీవితంలో తాను సాధించిన గొప్ప ఏదైనా ఉందంటే అది అల్లు అర్జున్ స్నేహమని ఎమోషనల్ గా చెప్పుకొచ్చాడు. ఇరవై సంవత్సరాల క్రితం గీత ఆర్ట్స్ నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి తలెత్తినప్పుడు అరవింద్ గారితో గొడవ పడకపోయి ఉంటే ఇవాళ తాను ఈ స్థానంలో ఉండేవాడిని కాదని చెప్పడం ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ని కదిలించింది.
ఇప్పుడదే అరవింద్ తో తండేల్ లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ తీసే స్థాయికి బన్నీ వాస్ చేరుకోవడం వెనుక ఎవరున్నారో అర్థమయ్యిందిగా. ఆయ్ గురించి అల్లు అర్జున్ స్వయంగా ట్వీట్ చేయడం వల్ల రీచ్ పెరుగుతోందని, అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్స్ లో గమనించామని హీరో నితిన్ నార్నె పేర్కొనడం గమనార్హం. రేపు విపరీతమైన పోటీ మధ్య విడుదలవుతున్న ఆయ్ మీద గీతా ఆర్ట్స్ బృందం పెట్టుకున్న నమ్మకం మాములుగా లేదు. రెండు భారీ మాస్ ఎంటర్ టైనర్ల మధ్య తమ వినోదాత్మక చిత్రం తప్పకుండా అలరిస్తుందని ధీమాగా ఉన్నారు. రేపు సాయంత్రం నుంచి షోలు పడబోతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates