Movie News

ప్రభాస్‌తో జోడీ.. మృణాల్ సారీ


ప్రస్తుతం ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ అయిన ప్రభాస్.. విరామం లేకుండా సినిమాలు చేసుకుపోతున్నాడు. ఆ సినిమాల స్కేల్ వేరే లెవెల్లో ఉంటోంది. బాహుబలి తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కోవడంతో ప్రభాస్‌ను తక్కువ అంచనా వేశారు కానీ.. ఆ తర్వాత సలార్, కల్కి లాంటి బ్లాక్ బస్టర్లతో తన స్టామినా ఏంటో చూపించాడు ప్రభాస్. యంగ్ రెబల్ స్టార్ నుంచి తర్వాత ‘రాజా సాబ్’ మూవీ రాబోతోంది. అది వేసవి రిలీజ్‌ కన్ఫమ్ చేసుకుంది. దీని తర్వాత ప్రభాస్ ఏ సినిమాలో నటిస్తాడనే విషయంలో కొంత సస్పెన్స్ నెలకొంది.

ప్రశాంత్ నీల్‌తో సలార్-2 చేయాల్సి ఉంది. సందీప్ రెడ్డి వంగతో ‘స్పిరిట్’ కూడా లైన్లో ఉంది. కానీ వాటిని వెనక్కి నెట్టి ‘సీతారామం’ దర్శకుడు హను రాఘవపూడితో ‘ఫౌజి’ అనే వార్ బ్యాక్ డ్రాప్ ఉన్న లవ్ స్టోరీని ప్రభాస్ టేకప్ చేస్తున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి.

ఈ సినిమాలో ప్రభాస్ సరసన సజల్ అలీ అనే పాకిస్థాన్ నటి కథానాయికగా నటించనున్నట్లు ఇంతకుముందు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఐతే లేటెస్ట్‌గా మృణాల్ పేరు తెరపైకి వచ్చింది. ఓ నెటిజన్ ప్రభాస్‌తో మృణాల్ ఉన్న ఒక ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి ‘ఫౌజి’ ఫస్ట్ లుక్ అని కామెంట్ పెట్టాడు. దీనిపై స్వయంగా మృణాల్ స్పందించడం విశేషం. “మీ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెడుతున్నందుకు సారీ. నేను ఈ ప్రాజెక్ట్‌లో లేను” అని మృణాల్ క్లారిటీ ఇచ్చేసింది. దీంతో మృణాల్ ఫ్యాన్స్ కొంత డిజప్పాయింట్ అయ్యారు.

ఐతే ప్రభాస్‌ సరసన నటించలేదు కానీ.. మృణాల్ ఆల్రెడీ ప్రభాస్ సినిమాలో భాగం అయింది. ‘కల్కి’లో ఆమె ఒక క్యామియో రోల్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ‘ఫౌజి’ విషయానికి వస్తే హను రాఘవపూడి ఒక ట్రూ ఇంటర్నేషనల్ మూవీని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భారీ యుద్ధ సన్నివేశాలు ఉంటాయట.

This post was last modified on August 14, 2024 4:10 pm

Share

Recent Posts

చిరంజీవి ఎవ‌రినీ తొక్క‌డ‌య్యా…

తెలుగులో తెర మీద హీరోల‌కు ఎలివేష‌న్లు ఇవ్వ‌డంలో చాలామంది ద‌ర్శ‌కులు త‌మ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదిక‌ల మీద ఎలివేష‌న్లు…

27 minutes ago

త‌మిళ ప్రేక్ష‌కులకో దండం

ఒకప్పుడు త‌మిళ ప్రేక్ష‌కుల అభిరుచి గురించి ఇత‌ర భాష‌ల వాళ్లు గొప్ప‌గా చెప్పుకునేవాళ్లు. కొత్త త‌ర‌హా సినిమాల‌ను, ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌ను…

39 minutes ago

లోక‌ల్ ఫైట్‌: జ‌గ‌న్‌ ముందే చేతులెత్తేశారా?

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు ముహూర్తం రెడీ అవుతోంది. ప్ర‌భుత్వం వైపు నుంచి ఈ ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింది.…

56 minutes ago

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా..?

వైసీపీ ఓటు బ్యాంకు స్థిర‌మేనా? ఆ పార్టీ చెబుతున్న‌ట్టు 40 శాతం ఓటు బ్యాంకు వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కు అలానే…

1 hour ago

థియేటర్లకు జై కొడుతున్న తెలుగు ప్రేక్షకులు

జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…

1 hour ago

కాక్రోచులను వెనక్కి తరిమిన వారెవరు?

విద్యార్థి ఉద్య‌మాల‌కు తెర‌దీసిన కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు తొలిసారి ప‌రాభవం ఎదురైంది. ఇటీవ‌ల నీట్ ప్ర‌శ్న ప‌త్రం…

1 hour ago