సుషాంత్ సింగ్ రాజ్పుట్ది ఆత్మహత్య కాదు హత్య అంటూ అతని తండ్రి ఆరోపించాడు. తన అనుమానాలను వ్యక్తం చేస్తూ ఎఫ్ఐఆర్ దాఖలు చేసాడు. ముందు ఆ కోణంలోనే మొదలైన దర్యాప్తు విచారణలో డ్రగ్స్ యాంగిల్ వైపు డైవర్ట్ అయింది. రియా చక్రవర్తిని ఒక కేసు మీద విచారణకు పిలిచి మరో వ్యవహారంలో దోషిగా నిలబెట్టి అరెస్ట్ చేసారు. ఇక అక్కడ్నుంచి నెమ్మదిగా సుషాంత్ సింగ్ కథ మరుగున పడిపోతూ వచ్చింది.
ప్రస్తుతం ఆ కేసు పూర్తిగా డ్రగ్స్ చుట్టూనే తిరుగుతోంది. రియా చిన్న చేప అయితే ఇప్పుడు దీపిక, శ్రద్ధ, రకుల్ లాంటి పెద్ద వాళ్లను విచారణకు పిలిపిస్తూ వుండడంతో మీడియా కూడా సుషాంత్ సింగ్ ముచ్చట మరచిపోయింది. అతడు మరణించి అయిదు నెలలు గడచిపోవడంతో సోషల్ మీడియాలో కూడా హడావుడి తగ్గిపోయింది. సుషాంత్ కేసుని పక్కదోవ పట్టించేసారని, అతడికి న్యాయం జరగకుండా వేరే ఏవో విషయాలతో కాలక్షేపం చేస్తున్నారని అతని కుటుంబం ఆక్రోశం వ్యక్తం చేస్తోంది.
జనాలకు కూడా ఎప్పటికప్పుడు కొత్త అంశాలు కావాలి కనుక సుషాంత్ ఆత్మహత్య పరంగా ఎలాంటి ఎక్సయిటింగ్ అప్డేట్స్ లేక దానిని వదిలేసారు. దీపిక లాంటి పెద్ద హీరోయిన్లు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నారగానే దీని గురించి మరింత సమాచారం కోసం ఇంటర్నెట్లో దేవులాడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates