దర్శకుడు శంకర్ అంటే రాజమౌళి నుంచి అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న ఫిలిం నగర్ కుర్రాడి దాకా అందరికీ అపారమైన గౌరవం. 1994లో జెంటిల్ మెన్ లాంటి భారీ చిత్రంతో మొదలుపెట్టి రజనీకాంత్ రోబో వరకు ఆయన సృష్టించిన విజువల్ వండర్స్ ఎందరికో టెక్స్ట్ బుక్స్ లాంటివి. ఎవ్వరైనా సరే డిజాస్టరని ఒప్పుకునే ఐకి సైతం కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారనే సంగతి మర్చిపోకూడదు. 2.0 ఆశించిన స్థాయిలో ఆడకపోయినా ఆయన చూపించిన సృజనాత్మకత, క్రియేటివ్ బ్రిలియన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇదంతా గతం. భారతీయుడు 2 వచ్చాక ఇప్పుడిది మారిపోయింది.
నిన్న నెట్ ఫ్లిక్స్ లో ఇండియన్ 2 స్ట్రీమింగ్ మొదలైనప్పటి నుంచి సోషల్ మీడియా ట్రోలింగ్ ఓ రేంజ్ లో జరుగుతోంది. ముఖ్యంగా కమల్ హాసన్ పాత్రను తీర్చిదిద్దిన విధానం, సిద్దార్థ్ ప్రియా భవాని శంకర్ ల నటన, రకుల్ ప్రీత్ సింగ్ దారీతెన్నూ లేని క్యారెక్టర్, బాబీ సింహ కామెడీ ఒకటా రెండా నెటిజెన్లను దుమ్మెత్తిపోయడానికి బోలెడు కంటెంట్ దొరికేసింది. వాస్తవానికి నెట్ ఫ్లిక్స్ నుంచి నేరుగా స్క్రీన్ షాట్లు, వీడియో క్లిప్పులు తీసుకోవడానికి అవకాశం ఉండదు. అందుకే పైరసీ ప్రింట్లను డౌన్లోడ్ చేసుకుని మరీ ట్విట్టర్, ఇన్స్ టా వేదికగా శంకర్ ని లక్ష్యంగా చేసుకోవడం మొదలుపెట్టారు.
దీన్ని బట్టే శంకర్ తాను ఎంత దారుణమైన అవుట్ ఫుట్ ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. ఇండియన్ 2 దెబ్బకు జనాలు గేమ్ చేంజర్ మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రామ్ చరణ్ లాంటి ప్యాన్ ఇండియా హీరోని ఎలా చూపించి ఉంటారోననే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజానికిది ఆలస్యం కావడం వెనుక ప్రధాన కారణం ఇండియన్ 2నే. మరి గేమ్ చేంజర్ మీద ఫోకస్ వల్ల కమల్ సినిమా మీద పట్టు తప్పారా లేక చరణ్ మూవీ మీద తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నారా అనేది డిసెంబర్ లో తేలిపోతుంది. అది హిట్ అయితే శంకర్ మీద పడిన సేనాపతి మచ్చ తొలగిపోయి ఇండియన్ 3కి బజ్ వస్తుంది.
This post was last modified on August 10, 2024 11:35 am
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…