Movie News

థ్రిల్లింగ్… యూత్ సినిమాలో ఆర్ నారాయణమూర్తి ?

కమర్షియల్ రాజ్యంలో తాను అనుకున్న సిద్ధాంతాలకు మాత్రమే కట్టుబడి సినిమాలు తీసిన హీరో, దర్శకుడిగా ఆర్ నారాయణమూర్తి అంటే  ప్రేక్షకులకే కాదు ఇండస్ట్రీలోనూ ఎంతో గౌరవం ఉంది. నలభై సంవత్సరాలకు పైగా పరిశ్రమలో ఉన్నా ఇప్పటికీ కాలినడకన, ఆటోలో వెళ్లే పీపుల్స్ స్టార్ ని చూసి ఆశ్చర్యపోయే వాళ్లకు కొదవే లేదు. ఎంత నష్టం వచ్చినా సరే సామజిక స్పృహ కలిగించే చిత్రాలు తీయడం మాత్రం ఆయన ఆపరు. ఇప్పటి తరంలో ఇలాంటి నటులు అరుదు కాదు అసలు లేరు.

గతంలో ఆర్టిస్టుగా ఆర్ నారాయణమూర్తికి తమ సినిమాల్లో నటించమని బోలెడు ఆఫర్లు వచ్చినా ఇప్పటిదాకా ఆయన తిరస్కరిస్తూ వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ లో పోసాని కృష్ణమురళి క్యారెక్టర్ కోసం దర్శకుడు పూరి జగన్నాథ్ బ్లాంక్ చెక్ ఇస్తే నో అనడం అప్పట్లో ఒక సెన్సేషన్. అందుకే ఎన్ని అవకాశాలు వచ్చినా టెంప్ట్ కాకుండా దానికి కట్టుబడుతూ వచ్చారు. అయితే ఇప్పుడా నియమాన్ని పక్కనపెట్టి ఒక ప్రత్యేక పాత్రకు ఓకే చెప్పినట్టుగా లేటెస్ట్ అప్డేట్.

ఎనిమిదేళ్ల క్రితం 2018లో హుషారు వచ్చింది. సింపుల్ స్టోరీ, యూత్ ఫుల్ ఎలిమెంట్స్, చక్కని పాటలతో దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి తీసిన విధానం ప్రేక్షకులను మెప్పించింది. డబ్బులు కూడా వచ్చాయి. ఉండిపోరాదే పాట యువతలో మారుమ్రోగిపోయింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ గా హుషారు 2 తెరకెక్కుతోంది. ఇందులో ఒక ముఖ్యమైన నక్సలైట్ పాత్రకు నారాయణమూర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. తన భావజాలానికి దగ్గరగా ఉండే రోల్ కావడంతో ఒప్పుకున్నారని వినికిడి.

ఇంకా అధికారికంగా ప్రకటన రానప్పటికీ విశ్వసనీయ వర్గాలు దాదాపు కన్ఫర్మ్ అంటున్నాయి. అదే జరిగితే హుషారు 2 టీమ్ ఒక ఘనత సాధించినట్టే. పీపుల్స్ స్టార్ ఒప్పుకునే స్థాయిలో రాసుకున్నారంటే కంటెంట్ ఏదో బలంగా ఉండే ఉంటుంది. ప్రస్తుతం హుషారు 2 చిత్రీకరణకు సంబంధించి డీటెయిల్స్ బయటికి ఇవ్వకుండా టీమ్ సైలెంట్ గా పని చేసుకుంటోంది. అయినా యూత్ స్టోరీలో నక్సలైట్ ఏం చేస్తారో, అంతగా నారాయమూర్తిగారికి నచ్చేంత కంటెంట్ ఏముందో లెట్ వెయిట్ అండ్ సీ.

This post was last modified on March 9, 2026 5:55 pm

Share

Recent Posts

మంచి ఆలోచన చేసిన రణబాలి

దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…

2 hours ago

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

10 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

10 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

10 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

10 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

12 hours ago