Movie News

త్రిషపై నోరు జారి.. క్షమాపణలు చెప్పిన దర్శకుడు

తమిళనాట సినీ, రాజకీయ రంగాల్లో ఇటీవల చర్చనీయాంశంగా మారిన పేరు.. త్రిష.
ఈ సీనియర్ నటికి, రాజకీయాల్లోకి వచ్చిన అగ్ర కథానాయకుడు విజయ్‌కి మధ్య బంధం గురించి ఇటీవల ఎంత చర్చ జరుగుతోందో తెలిసిందే. విజయ్ విడాకులకు త్రిషనే కారణమనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఈ ప్రచారాన్ని నిజం చేస్తూ.. ఇటీవల విజయ్, త్రిష కలిసి ఒక పెళ్లి వేడుకకు హాజరు కావడం చర్చనీయాంశం అయింది. దీంతో త్రిష మీద పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియా ట్రోలింగ్ కూడా గట్టిగా జరుగుతోంది.

ఇలాంటి టైంలోనే సీనియర్ నటుడు, దర్శకుడు పార్తీబన్.. ఒక సినీ వేడుకలో త్రిషను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. స్టేజ్ మీద ఆయన మాట్లాడుతుండగా.. వెనుక ఉన్న స్క్రీన్ మీద త్రిష ఫొటో డిస్‌ప్లే అయింది. త్రిషను ఉద్దేశించి పార్తీబన్ మాట్లాడుతూ.. ‘‘ఆమె కొన్ని రోజులు ఇంట్లోనే ఉండడం మంచిది. ఆమె బయటికి వస్తే లేని పోని సమస్యలు వస్తున్నాయి’’ అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లతో ఆడిటోరియం హోరెత్తింది.

ఐతే ఈ వ్యాఖ్యలపై త్రిష మండిపడింది. చేతిలో మైక్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే కామెడీ అవ్వదు, మూర్ఖత్వమే అవుతుందని వ్యాఖ్యానించింది. విజయ్, త్రిష ఫ్యాన్స్ కూడా పార్తీబన్‌ను ఎటాక్ చేశారు. ఈ నేపథ్యంలో పార్తీబన్ స్పందించారు. తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఈ విషయంలో జరిగిందంతా తప్పుగా భావిస్తున్నారని.. అలాంటపుడు తనకు క్షమాపణలు చెప్పడం తప్ప వేరే మార్గం లేదని పార్తీబన్ పేర్కొన్నారు. అంతటితో ఈ వ్యవహారం సద్దుమణిగినట్లయింది.

This post was last modified on March 9, 2026 4:08 pm

Share

Recent Posts

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

3 hours ago

ఇంతకీ అలియాస్ రుక్మిణి ఎవరు?

ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…

4 hours ago

కోన మీద కోపం తగ్గిందా?

కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…

5 hours ago

సామాజిక వ‌ర్గ రాజ‌కీయం క‌లిసొచ్చిందా జ‌గ‌న్‌… ?

రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఒక‌వైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచ‌న చేస్తామంటే కుదురుతుందా? అంటే కాద‌న్న‌ది అంద‌రికీ తెలిసిందే. కానీ,…

5 hours ago

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

8 hours ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

9 hours ago