నిన్న విడుదలైన కమిటీ కుర్రోళ్ళు డీసెంట్ టాక్ తో ఉన్నవాటిలో మెరుగైన కలెక్షన్లతో జనాన్ని రప్పిస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఏమంత ఆశాజనకంగా లేకపోయినా ప్రీమియర్, మార్నింగ్ షో టాక్ బయటికి వచ్చాక పరిస్థితిలో మార్పు వచ్చింది. సగటున రోజుకు పదహారు వేలకు పైగా బుక్ మై షో టికెట్లు అమ్ముడుపోతున్నాయి. హైదరాబాద్ లోనే ఈ ట్రెండ్ ఎక్కువగా ఉన్నప్పటికీ క్రమంగా బిసి సెంటర్లలోనూ ఊపందుకుంటుందని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే కమిటి కుర్రోళ్ళు జోరు తగ్గించేందుకే అన్నట్టు ఒక అడ్డంకి మహా ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవం. అదే మురారి.
ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం వచ్చిన మురారిని చూసేందుకు క్లాసు మాసు ఎగబడుతున్నారు. చాలా ఏరియాల్లో రికార్డు కలెక్షన్లు నమోదయ్యాయి. ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో బిజినెస్ మెన్, ఆరంజ్, ఖుషి తాలూకు రీ రిలీజ్ రికార్డులు తుడిచిపెట్టుకుపోతున్నాయి. ఒకవేళ మురారి కనక లేకపోయి ఈ సినిమా చూసిన ప్రేక్షకుల్లో కనీసం ఒక పాతిక శాతం కమిటీ కుర్రాళ్ళకు వచ్చినా ఫిగర్లలో పెద్ద మార్పు కనిపించేది. స్టార్ క్యాస్టింగ్ లేకపోవడం దీనికో ప్రతిబంధకంగా మారినా క్రమంగా పెరుగుతున్న టాక్ ఇంకో వారం రోజుల్లోపు సూపర్ హిట్ దిశగా తీసుకెళ్తుందో లేదో చూడాలి.
వచ్చే వారం ఆగస్ట్ 15 భారీ పోటీ నెలకొన్న నేపథ్యంలో కమిటీ కుర్రోళ్ళకు ఫస్ట్ వీక్ చాలా కీలకం. డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్, తంగలాన్, ఆయ్ లు వస్తున్న నేపథ్యంలో ఎంతమేరకు సెకండ్ వీక్ థియేటర్లను కుర్రోళ్ళు హోల్డ్ చేసుకుంటారో చెప్పలేం. రీ రిలీజులు కొత్త వాటి మీద ప్రభావం చూపిస్తున్నాయని గత ఏడాది కొన్ని సందర్భాలు ఋజువు చేశాక ఆ ట్రెండ్ మళ్ళీ ఊపందుకోలేదు. కానీ మురారి తిరిగి దానికి ఊపు తీసుకొచ్చింది. స్టార్ హీరోలైతే వీటిని తట్టుకోగలరు కానీ కమిటీ కుర్రాళ్ళ లాంటి చిన్న క్యాస్టింగ్ మూవీ ఎదురీదడం అంత సులభం కాదు. చూడాలి ఏమవుతుందో.
This post was last modified on August 10, 2024 11:24 am
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…