Movie News

15 నెలలు 3 ప్యాన్ ఇండియా సినిమాలు

సోలో హీరోగా అరవింద సమేత వీరరాఘవ తర్వాత ఏకంగా అయిదేళ్లకు పైగా గ్యాప్ వచ్చి అభిమానుల ఆకలి తీర్చి భుక్తాయాసం వచ్చేలా జూనియర్ ఎన్టీఆర్ చేసుకుంటున్న ప్లానింగ్ ఏదో అద్భుతం చేసేలా ఉంది. ఏడాదికి లేదా రెండు సంవత్సరాలకు ఒక రిలీజ్ చేసుకోవడమే స్టార్ హీరోలకు గగనంగా మారిపోయిన తరుణంలో 15 నెలల నిడివిలో 3 ప్యాన్ ఇండియా సినిమాలు విడుదలకు రావడమంటే చిన్న విషయం కాదు. యంగ్ టైగర్ అది చేసి చూపించబోతున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే ప్రభాస్ చూపించిన దూకుడునే తానూ ఫాలో అవుతూ స్పీడ్ పెంచాలని నిర్ణయించుకున్నాడు.

దేవర పార్ట్ వన్ ఈ సెప్టెంబర్ 27 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్న అంచనాలు ట్రైలర్ వచ్చాక ఏ స్థాయిలో పెరుగుతాయో ఊహించడం కష్టం. వచ్చిన రెండు పాటలు హైప్ ని ఎక్కడికో తీసుకెళ్లాయి. వచ్చే ఏడాది ఆగస్ట్ 14 హృతిక్ రోషన్ కలిసి చేసిన మల్టీస్టారర్ వార్ టూ థియేటర్లలో అడుగు పెడుతుంది. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు. యష్ రాజ్ ఫిలింస్ పక్కా ప్లానింగ్ తో డేట్ లాక్ చేసుకుంది కనక మార్చుకునే సమస్యే లేదు. కట్ చేస్తే ఇంకో అయిదు నెలలు తిరక్కుండానే 2026 జనవరి 9 ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ క్రేజీ మూవీ సంక్రాంతి బరిలో ఉంటుంది.

ఏదైనా షూటింగ్ జాప్యం జరిగితేనో లేదా అనూహ్యమైన పరిస్థితులు తలెత్తడం వల్లనో తప్ప పైన చెప్పిన షెడ్యూల్ యధాతథంగా అమలు పరిచేందుకు జూనియర్ ఎన్టీఆర్ రెడీ అవుతున్నాడు. దేవర 2 కూడా 2026లోనే వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ ఫలితం తేలాక దీనికి సంబంధించిన ప్రకటన రానుంది. ఆర్ఆర్ఆర్ కోసం మూడేళ్ళ కాలాన్ని త్యాగం చేయాల్సి వచ్చిన తారక్ ఇకపై ఎలాంటి గ్యాప్ రాకుండా వేగంగా సినిమాలు చేసేందుకు నిర్ణయం తీసుకున్నాడు. హాయ్ నాన్న శౌర్యువ్ తో మూవీ చేయొచ్చనే టాక్ వచ్చింది అది నిజం కాదని ఆ దర్శకుడే తేల్చి చెప్పాడు.

This post was last modified on August 9, 2024 3:03 pm

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

3 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

3 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

4 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

11 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

12 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

14 hours ago