న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన సరిపోదా శనివారం విడుదల దగ్గర పడుతోంది. ఆగస్ట్ 29 ఎంతో దూరంలో లేకపోవడం టీమ్ ప్రమోషన్ల వేగం పెంచింది. నాని టీవీ ఛానల్స్ కు వెళ్లి పబ్లిసిటీ పెంచే పనిలో ఉండగా ఎస్జె సూర్య స్పెషల్ గా హైదరాబాద్ లోనే ఉంటూ ఇంటర్వ్యూలిస్తున్నాడు. ఇండిపెండెన్స్ డేకి వచ్చే డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ లు ఆ టైంకంతా నెమ్మదిస్తాయి కాబట్టి నానికి సోలో రిలీజ్ దక్కనుంది. పోటీ ఏం లేదు. ప్యాన్ ఇండియా రిలీజ్ కావడంతో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు భారీ ఎత్తున థియేటర్లను లాక్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు.
ఇక ఎస్జె సూర్య ఈ సినిమా కథకు సంబంధించినకొన్ని ముఖ్యమైన క్లూస్ ఇవ్వడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. వాటితో పాటు కొన్ని లీక్స్ స్టోరీ లైన్ కి రూపాన్నిస్తున్నాయి. తల్లికిచ్చిన మాట మేరకు వారంలో 6 రోజులు కోపాన్ని అణుచుకునే సూర్య శనివారం మాత్రం తన ఉగ్ర రూపాన్ని బయటికి తీస్తాడు. ఎవడెవడు ఏమేం చేశాడో రాసుకుని మరీ వాళ్ళ లెక్కని వీకెండ్ లో సరిచేస్తాడు. సోకులపాలెంలో నివసించే నాని కుటుంబం చుట్టూ పేదలు ఉంటారు. వాళ్ళ పాలిట రాక్షసుడిగా మారిన ఒక పోలీస్ ఆఫీసర్ ని కేవలం ఒక్క రోజు మాత్రమే ఎదిరించే సమస్యతో ఎలా కట్టడి చేస్తాడనేదే స్టోరీ పాయింట్ గా తెలుస్తోంది.
పైకి నాని వర్సెస్ ఎస్జె సూర్య యుద్ధంలా కనిపించినా ఇందులో బోలెడు చోటా విలన్లు ఉంటారట. దసరాలో చూసిన నాని వయొలెంట్ పాత్రకు మించి ఇందులో స్టయిలిష్ యాక్షన్ ని వివేక్ ఆత్రేయ డిజైన్ చేశారని ఇన్ సైడ్ టాక్. అందుకే హాయ్ నాన్న తర్వాత ఏడు నెలల గ్యాప్ వచ్చినా కూడా నాని ఓపికగా ఎదురుచూశాడని, ఫలితం మీద అంత నమ్మకం వచ్చేసిందని సన్నిహితులు అంటున్నారు. ఒకవేళ సరిపోదా శనివారం కనక మల్టీలాంగ్వేజెస్ లో వర్కౌట్ అయితే ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో రాబోయే ప్యాన్ ఇండియా మూవీకి బజ్ పరంగా చాలా ఉపయోగపడుతుంది. చూద్దాం.
This post was last modified on August 8, 2024 2:12 pm
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…
అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…