టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు కలుసుకున్నారు. సోమవారం అమరావతికి వచ్చిన తుమ్మల.. చంద్రబాబుతో భేటీ అయ్యారు. వాస్తవానికి.. మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ అమరావతిలో పర్యటించిన నేపథ్యంలో చంద్రబాబు తీరిక లేకుండా ఉన్నారు. అయినా కూడా తన పాత మిత్రుడు, తెలంగాణ మంత్రి రావడంతో తీరిక చేసుకుని మరీ ఆయనతో మాట్లాడారు.
బలమైన స్నేహం..
టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉన్న తుమ్మల నాగేశ్వరరావు.. ఖమ్మం నుంచి పలుమార్లు విజయం సాధించారు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో తుమ్మల మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఇక, తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఆయన టీడీపీలోనే ఉన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత.. 2014లో టీడీపీని వీడి అప్పటి టీఆర్ ఎస్‌లో చేరిపోయారు. ఆ తర్వాత.. మంత్రి పీఠాన్ని కూడా దక్కించుకున్నారు. అయితే.. 2018 ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ ఎస్ ఆయనను దూరం పెట్టింది. దీంతో గత 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని విజయం దక్కించుకున్నారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు.
చంద్రబాబుపై పన్నెత్తు విమర్శలు చేయని తుమ్మల.. రాజకీయంగా విభేదించినా.. వ్యక్తిగతంగా చంద్రబాబుకు చేరువగానే ఉన్నారు. కాగా.. సుదీర్ఘ కాలం తర్వాత చంద్రబాబుతో భేటీ అయిన తుమ్మల.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయనకు నివేదిక ఇచ్చారు. ఆయా సమస్యల పరిష్కారానికి సహకరించాలని విన్నవించారు.
ఇవీ.. వినతులు!
This post was last modified on February 17, 2026 12:15 am
సీనియర్ నటుడు సుమంత్ ప్రధాన పాత్రలో వచ్చిన కొత్త సినిమా మహేంద్రగిరి వారాహి మీద విడుదలకు ముందు మంచి అంచనాలే…
తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…
హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…