మిస్టర్ ఛేంజర్ బిరుదు ఇవ్వాల్సిందే

ఒక భాషలో హిట్ అయిన సినిమాని ఇంకో లాంగ్వేజ్ లో రీమేక్ చేస్తున్నప్పుడు సాధారణంగా పెద్దగా మార్పులు చేయకుండా తీయడానికే హీరోలు, దర్శకులు ఇష్టపడతారు. ఒకవేళ ఎక్కువ మార్చి ఫలితం తేడా కొడితే నిందను మోయాల్సి వస్తుంది కాబట్టి.

ఉదాహరణకు మోహన్ లాల్ లూసిఫర్ లో ఉన్న టోవినో థామస్ ఎపిసోడ్ ని చిరంజీవి గాడ్ ఫాదర్ లో పూర్తిగా తీసేయడం ఫైనల్ అవుట్ ఫుట్ మీద ప్రభావం చూపించింది. అందుకే రిజల్ట్ రిపీట్ కాలేదు. అయ్యప్పనుం కోశియుమ్ లో లేని కమర్షియల్ మసాలాని భీమ్లా నాయక్ లో జోడించడం వల్ల జరిగిన మేజిక్ అంతంతమాత్రమే.

కానీ దర్శకుడు హరీష్ శంకర్ లెక్క మాత్రం వేరేలా ఉంటుంది. గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ విషయంలో ఆయన చేసిన మార్పులు మాస్ కి బాగా రీచయ్యి బాక్సాఫీస్ వసూళ్లు పెరిగేందుకు ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా దబాంగ్ ఇప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ ముందు సల్మాన్ ఖాన్ చేసింది చాలా తక్కువనిపిస్తుంది.

ఇప్పుడు మిస్టర్ బచ్చన్ వంతు వచ్చింది. అజయ్ దేవిగన్ రైడ్ చూసినవాళ్లకు చాలా డౌట్లు వస్తున్నాయి. ఒరిజినల్ లో భార్యగా కనిపించిన ఇలియానా స్థానంలో ఇక్కడ ప్రియురాలి పాత్రలో భాగ్యశ్రీ బోర్సే వచ్చింది. దీని వల్ల లవ్ ట్రాక్, పాటలు అదనంగా చేరాయి.

విలన్ గా జగపతిబాబుని పెట్టుకోవడం ద్వారా రవితేజ హీరోయిజంని ఎక్కువ ఎలివేట్ చేయడానికి స్కోప్ దొరికింది. దాన్ని హరీష్ శంకర్ ఫుల్లుగా వాడుకున్న వైనం నిన్న ట్రైలర్ లో కనిపించేసింది. మ్యూజికల్ గా పెద్దగా ప్రాధాన్యం లేని రైడ్ కథలో ఇప్పుడు మిక్కీ జె మేయర్ మాస్ పాటలు వచ్చి చేరాయి. అఫ్కోర్స్ మాస్, గ్లామర్ ఎక్కువ హైలైట్ చేస్తూ మిస్టర్ బచ్చన్ ని రూపొందించడం పట్ల కామెంట్లు వస్తున్నాయి కానీ స్టార్ ఇమేజ్ ఉన్న హీరోతో ఇలా చేస్తేనే వర్కౌటయ్యే పరిస్థితుల్లో ఇలా తీస్తేనే కరెక్ట్. ఆగస్ట్ 15 పోటీ పడుతున్న సినిమాల్లో బజ్ పరంగా చూసుకుంటే మిస్టర్ బచ్చన్ వైపు అటెన్షన్ పెరుగుతున్న మాట వాస్తవం.