ఎనర్జిటిక్ స్టార్ రామ్, దర్శకుడు పూరి జగన్నాధ్ కలయికలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఎంత పెద్ద బ్లాక్ బస్టరో అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్ కూడా అంత సులభంగా మర్చిపోలేరు. రేసులో వెనుకబడిన మణిశర్మని ఒక్కసారిగా ఫామ్ లోకి తీసుకొచ్చిన మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా దీనికి ఫ్యాన్స్ ప్రత్యేక స్థానం ఇస్తారు. అందుకే కొనసాగింపుగా వస్తున్న డబుల్ ఇస్మార్ట్ మీద ప్రేక్షకుల్లో మాములు అంచనాలు లేవు. ఆగస్ట్ 15 భారీ పోటీ మధ్య వస్తున్న ఈ మాస్ ఎంటర్ టైనర్ హైప్ మొత్తం ట్రైలర్ మీద ఆధారపడిన నేపథ్యంలో అందరి కళ్ళు దీని మీదే ఉన్నాయి. వైజాగ్ వేదికగా ఆ లాంఛనం వైభవంగా జరిగింది.
కథలో కొన్ని ముఖ్యమైన క్లూస్ దాచకుండా చెప్పేశారు. పాతబస్తీ శంకర్ (రామ్) ముందు వెనుక చూసే రకం కాదు. తోచింది చేసేయడం, అడ్డొస్తే తొక్కేయడం ఇదే అతని స్టయిల్. ఓ పోరి (కావ్య థాపర్) ని చూసి మనసు ఇచ్చేసి వెంటపడి మరీ ప్రేమించేలా చేసుకుంటాడు. తలలో యుఎస్బి చిప్పు పెట్టుకునే శంకర్ మీద ఒక ఇంటర్నేషనల్ డాన్ (సంజయ్ దత్) కన్ను పడుతుంది. తన మెదడుని శంకర్ కి బదలాయించే ప్రమాదకరమైన పనిని చేస్తాడు. అక్కడి నుంచి అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకుని మాఫియా ప్రపంచంలో సంచనాలు జరుగుతాయి. అవేంటో తెరమీద చూడాలి.
రెండున్నర నిమిషాల ట్రైలర్ లో ప్రతి ఫ్రేమ్ పూరి జగన్నాధ్ మార్కు మాస్ మ్యానరిజంతో నిండిపోయింది. దానికి రామ్ తోడవ్వడంతో హిస్టీరియా మరింత పెరిగిపోయింది. ఇస్మార్ట్ శంకర్ లోని మెయిన్ పాయింట్ నే ఇందులోనూ తీసుకున్నట్టు కనిపించినా దానికి మించి పెద్ద స్కెచ్చే వేశారు పూరి. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తన డ్యూటీకి న్యాయం చేయగా కావ్య గ్లామర్ షోతో పాటు చార్మినార్ మాస్ డైలాగులు విజిల్స్ వేయించేలా ఉన్నాయి. ఆగస్ట్ 15 విడుదల కాబోతున్న డబుల్ ఇస్మార్ట్ మొత్తానికి అనుకున్న టార్గెట్ అనుకుంది. హైప్ అమాంతం పెరిగేలా పూరి కొత్త జోష్ ఇచ్చేశారు.
This post was last modified on August 5, 2024 10:31 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…