ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎంత గొప్ప తండ్రో.. ఆయన కొడుకు ఎస్పీ చరణ్‌ను అడిగితే గొప్పగానే చెబుతాడు. ఐతే సినిమాల్లో కూడా బాలు మంచి తండ్రిగా పేరు తెచ్చుకున్నాడు. బాలు కేవలం గొప్ప గాయకుడు మాత్రమే కాదు.. మంచి నటుడు కూడా. తెరపై ఆయన అనేక అద్భుతమైన పాత్రలు పోషించాడు. ఐతే ఆ పాత్రలన్నీ కూడా ప్రేక్షకులకు వినోదాన్నందించినవే. బొద్దుగా ముద్దుగా కనిపించే బాలు.. తెరపైన చాలా వరకు నవ్వించే పాత్రలే చేశారు. ‘ప్రేమికుడు’ సినిమాలో ప్రభుదేవాకు తండ్రిగా హిలేరియస్ రోల్ చేశారు బాలు.
అది మొదలు అలాంటి పాత్రలు ఎన్నో బాలు ముందుకు వచ్చాయి. అప్పటిదాకా హీరోల తండ్రుల పాత్రల్ని చాదస్తుల్లా చూపించేవారు రచయితలు, దర్శకులు. కానీ బాలు తండ్రి పాత్ర చేశాడంటే.. దాని తీరే వేరుగా ఉంటుంది. చాలా సరదాగా ఉంటూ.. మోడర్న్‌గా ఆలోచిస్తూ.. కొడుకుతో పరాచికాలు ఆడుతూ.. హుషారుగా కనిపించే తండ్రి పాత్రలే ఎక్కువగా చేశారు బాలు.
అలా సరదాగా ఉంటూనే కథ కీలక మలుపు తిరిగే చోట హృద్యమైన నటనతోనూ ఆకట్టుకునేవారు. పవిత్ర బంధం, రక్షకుడు, మెరుపు కలలు లాంటి ఎన్నో సినిమాలు అందుకు రుజువు. తండ్రి పాత్రల్ని పక్కన పెడితే.. దొంగా దొంగా, వైఫ్ ఆఫ్ వి.వరప్రసాద్, మాయా బజార్ (ఇంద్రగంటి మోహనకృష్ణ మూవీ) లాంటి మరెన్నో సినిమాల్లో బాలు విలక్షణ నటనతో ఆకట్టుకున్నారు. ఇక లక్ష్మితో కలిసి రెండు పాత్రలే సినిమాను నడిపించే ‘మిథునం’లో బాలు నటన గురించి ఎంత చెప్పినా తక్కువే.
అది ఆయన నట ప్రస్థానంలో ఒక గొప్ప మైలురాయిగా చెప్పొచ్చు. తెలుగులో కంటే తమిళంలో ఎక్కువ సినిమాల్లో బాలు నటించడం విశేషం. చివరగా తెలుగులో ఆయన ‘దేవదాస్’ సినిమాలో మెరిశారు. అందులో దాసు పాత్రధారి అయిన నాని నైరాశ్యంలో ఉన్నపుడు అతడిలో ఉత్తేజం తీసుకువచ్చే పాత్రను పోషించారు బాలు. ఇలాగే ఆయన చేసిన ప్రతి సినిమాలోనూ ఒక హుషారు తీసుకొచ్చేవి ఆయన పాత్రలు. గాయకుడు అనే విషయం పక్కన పెట్టి చూస్తే.. నటుడిగా కూడా బాలు ఒక లెజెండ్ అనడంలో సందేహం లేదు.
This post was last modified on September 25, 2020 4:24 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…