గత కొన్నేళ్లుగా బాలీవుడ్ లో అత్యధిక శాతం చర్చ జరిగిన సినిమాగా యానిమల్ గురించే చెప్పుకోవాలి. ఇప్పటికీ ఏదో ఒక రూపంలో డిస్కషన్లు కనిపిస్తూనే ఉంటాయి. గత ఏడాది డిసెంబర్ లో రిలీజైనప్పుడు ప్రముఖ రచయిత జావేద్ అక్తర్ తో మొదలుకుని అందులో చిన్న వేషం వేసిన క్యారెక్టర్ ఆర్టిస్టు దాకా దాన్ని జడ్జ్ చేసేందుకు ఎగబడ్డారు. స్త్రీలను చూపించిన విధానం, హింస మీద ఎక్కువ కామెంట్లు వచ్చాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఎప్పటికప్పుడు ధీటైన సమాధానం ఇచ్చాడు కానీ హీరో రణ్బీర్ కపూర్ మాత్రం ఎక్కడా దీని గురించి మాట్లాడలేదు. ఏడు నెలల తర్వాత ప్రస్తావన తెచ్చాడు.
కేవలం ఎంటర్ టైన్మెంట్ కోసం యానిమల్ ని తెరకెక్కించామని, అయితే కొందరు ఇందులో నటించకుండా ఉండాల్సిందని అన్నారని, అలాంటి స్త్రీ ద్వేష చిత్రంగా యానిమల్ ని ప్రొజెక్ట్ చేయడం వల్ల జనంలోకి అలా వెళ్లిందని, మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని, వాళ్ళకు సారీ చెప్పానని అనడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సోషల్ మీడియాలో ఉన్న నెగటివిటీ ఇలాంటి విషయాల్లో ఎంత దారుణంగా ప్రవర్తిస్తుందో చెప్పిన రన్బీర్ కపూర్ ఎవరితో గొడవలు పడే ఉద్దేశం లేనందు వల్లే క్షమాపణ చెప్పానని వివరించాడు. యానిమల్ వల్లే తన ఫాలోయింగ్ పెరిగిందని ఒప్పుకున్నాడు.
నిజానికి ఇదంతా అవసరం లేకపోయినా రన్బీర్ కపూర్ తనవంతు బాధ్యతగా కామెంట్లకు బదులు చెప్పడం బాగుంది. ప్రస్తుతం రామాయణంలో బిజీగా ఉన్న ఈ బాలీవుడ్ సూపర్ స్టార్ మరో నాలుగేళ్ల పాటు దొరకనంత బిజీగా ఉన్నాడు. యానిమల్ పార్క్ ఎప్పుడు ఉంటుందనేది మాత్రం సస్పెన్స్ అంటున్నాడు. సందీప్ వంగా ప్రభాస్ స్పిరిట్ పనుల్లో తలమునకలై ఉండటంతో సీక్వెల్ ఎప్పుడనేది ఇప్పట్లో తేలకపోవచ్చు. తొమ్మిది వందల కోట్లకు పైగా వసూళ్లతో ఇండస్ట్రీ హిట్స్ లో ఒకటిగా నిలిచిన యానిమల్ ఇంత కాలం గడిచినా ఏదో ఒక రూపంలో హాట్ టాపిక్ గా నిలవడం విశేషం.
This post was last modified on July 27, 2024 5:27 pm
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…