Movie News

ధనుష్‌కు ఏం ఎలివేషన్ ఇచ్చాడులే..

తమిళ కథానాయకుడు ధనుష్ ఇప్పుడు ఇండియా మొత్తంలో టాప్ స్టార్లలో ఒకడు. అతనెంత గొప్ప నటుడో కేవలం తమిళులే కాదు.. సౌత్, నార్త్ అని తేడా లేకుండా అందరూ చెబుతారు. తెలుగులో, హిందీలో కూడా తన సినిమా వస్తోందంటే ఆసక్తిగా చూస్తారు. ఐతే ఇప్పుడు అతనున్న స్థాయి చూసి ఒకసారి తన కెరీర్ ఎలా ఆరంభమైందో చూసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు.

‘తుల్లువదో ఎలమై’ అనే చిన్న సినిమాలో హీరో కాని హీరోగా తన ప్రస్థానం మొదలైంది. కేవలం తన ప్రతిభతోనే అతనీ స్థాయిని అందుకున్నాడు. కేవలం నటుడిగానే కాక గాయకుడిగా, గేయ రచయితగా, కథా రచయితగా, దర్శకుడిగా తన బహుముఖ ప్రజ్ఞను అతను చాటుకున్నాడు. తన ప్రతిభ, తపన ప్రకాష్ రాజ్ లాంటి లెజెండరీ నటుడిని సైతం అబ్బుర పరచడం విశేషం. ధనుష్ తనే హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘రాయన్’ తెలుగు ప్రి రిలీజ్ ఈవెంట్లో ప్రకాష్ రాజ్.. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి గురించి గొప్పగా మాట్లాడాడు.

“ధనుష్ తపన, కష్టం చూస్తే నాకు ముచ్చటేస్తుంది. అతను రాయన్ లాంటి పెద్ద సినిమా తీశాడు. ఇప్పుడు అది కాక చిన్న ఆర్టిస్టులతో ఓ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఇంకోవైపు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కొత్తగా ఏదో ట్రై చేస్తున్నాడు. ఇన్ని సినిమాలతో బిజీగా ఉంటూ.. నాకు ఈ మధ్యే ఒక మంచి కథ చెప్పాడు. నన్ను, నిత్యా మీనన్‌ను పెట్టి ఆ సినిమా తీయాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఒక వ్యక్తికి సినిమా అంటే ప్రేమ ఉంటే ఎంతైనా చేస్తాడు అనడానికి ఇది ఉదాహరణ. ఇదంతా చూస్తే నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనిపించింది” అని ప్రకాష్ రాజ్ చెప్పాడు.

ఎందరో దిగ్గజాలతో కలిసి పని చేయడమే కాక.. తానూ ఒక దిగ్గజంగా ఎదిగిన ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తి ధనుష్‌ గురించి ఇంత గొప్పగా మాట్లాడ్డం చిన్న విషయం కాదు. నిజంగా ధనుష్ ప్రతిభ, తన కష్టం, తపన చూస్తే ఎవ్వరికైనా ముచ్చటేస్తుందనడంలో సందేహం లేదు.

This post was last modified on July 22, 2024 10:47 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమర్షియల్ కోణంలో కన్నప్ప ప్రేమ రైటేనా

ఇంకో నలభై రోజుల్లో విడుదల కాబోతున్న కన్నప్ప కోసం మంచు విష్ణు ఇప్పటి నుంచే ప్రమోషన్లు మొదలుపెట్టాడు. ఇంటర్వ్యూలతో పాటు…

23 seconds ago

ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలకు ‘కూటమి’ అవార్డులు

ఏపీలోని కూటమి సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకునే ఈ నిర్ణయం ద్వారా…

3 minutes ago

నాగబాబు తేనెతుట్టెను కదిపారే..

నిన్నటి జనసేన జయకేతనం మీటింగ్ సోషల్ మీడియాలో పెద్ద స్థాయి చర్చకే దారి తీసింది. ఇందులో పవన్ కళ్యాణ్ తన…

37 minutes ago

భార‌త్ మోస్ట్ వాటెండ్ ఉగ్ర‌వాదిని చంపేసిన అమెరికా!!

ముంబై పేలుళ్లు, భారత పార్ల‌మెంటుపై ఉగ్ర‌వాద దాడుల‌ను లైవ్‌లో ప‌ర్య‌వేక్షించిన‌ట్టు ఆరోప‌ణలు ఉన్న‌.. మోస్ట్ వాంటెడ్ ఐసిసి ఉగ్ర‌వాది.. ఇస్లామిక్…

49 minutes ago

కేసీఆర్, బీఆర్ఎస్ లపై రేవంత్ స్వైర విహారం

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. సమావేశాల్లో మూడో రోజైన శనివారం సభ ప్రారంభం కాగానే… గవర్నర్ ప్రసంగంపై…

1 hour ago

క్రిష్ 4 బడ్జెట్ చూసి భయపడుతున్నారు

తెరమీద ఇండియన్ సూపర్ హీరోస్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు క్రిష్. హృతిక్ రోషన్ హీరోగా ఆయన తండ్రి రాకేష్…

2 hours ago