విశ్వంభర షూటింగ్ పూర్తవ్వడానికి అతి దగ్గరలో ఉంది. క్లైమాక్స్, ఇంట్రో పాట, కొంత ప్యాచ్ వర్క్ మినహాయించి దర్శకుడు వశిష్ట మొత్తం ఫినిష్ చేశాడు. దీని తర్వాత చిరంజీవి ఎవరితో సినిమా చేయబోతున్నారో ఇప్పటిదాకా క్లారిటీ లేదు. వచ్చే నెల ఆగస్ట్ 22 ఆయన పుట్టినరోజున దీనికి సంబంధించిన ప్రకటన వస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ ఛాన్స్ సందీప్ రెడ్డి వంగాకు దక్కిందనే వార్త కొన్ని ఫ్యాన్ గ్రూప్స్ మధ్య చక్కర్లు కొట్టడంతో కొత్త డౌట్లు పుట్టుకొస్తున్నాయి. నిజానికి సందీప్ వంగా చిరుకి డై హార్డ్ ఫ్యానే అయినా అసలీ ప్రచారంలో ఎంత వరకు నిజముందో తరచి చూద్దాం.
ఏ కోణంలో చూసుకున్నా సందీప్ వంగాతో చిరు కాంబో ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు. ఎందుకంటే ప్రభాస్ స్పిరిట్ తాలూకు స్క్రిప్ట్ పనులు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. షూట్ ఎప్పటి నుంచి మొదలుపెట్టాలనేది డార్లింగ్ చేతిలో ఉన్నప్పటికీ ప్రీ ప్రొడక్షన్ కు తగినంత సమయం కావాలి కాబట్టి సందీప్ ధ్యాస మొత్తం దాని మీదే ఉంది. ఇంకోవైపు భవిష్యత్తులో చేయబోయే అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన స్టోరీని సిద్ధం చేయాలి. ఈ రెండూ టి సిరీస్, భద్రకాళి సంయుక్త నిర్మాణంలో ఉంటాయి. రెండోదానికి గీత ఆర్ట్స్ భాగస్వామిగా తోడవుతుంది. మరి ఇక చిరుతో చేసే ఛాన్స్ ఎక్కడిది.
ఏదైనా అనూహ్యంగా జరిగితే తప్ప ఈ కలయికని ఊహించలేం. ప్రస్తుతం మెగాస్టార్ మోహన్ రాజా, హరీష్ శంకర్ ల వైపు సానుకూలంగా ఉన్నారని టాక్. అనుదీప్ కూడా ప్రయత్నించాడు కానీ కథ నచ్చకపోవడంతో తను విశ్వక్ సేన్ వైపు వెళ్ళిపోయాడు. వీళ్ళు కాకుండా మరో ఇద్దరు ముగ్గురు ప్రయత్నించినా తక్కువ టైంలో సెట్స్ పైకి వెళ్లే ప్రణాళికలు లేవు. ప్రస్తుతం తని ఒరువన్ 2 (ధృవ) తో బిజీగా ఉన్న మోహన్ రాజా ఇంకో రెండు నెలల్లో ఫ్రీ అవుతారట. గాడ్ ఫాదర్ మేకింగ్ చూసి చిరు ఆయనకు మరో ఛాన్స్ ఇస్తారని అప్పట్లోనే చెప్పారు కనక చూస్తుంటే అదే నిజమయ్యేలా ఉంది.
This post was last modified on July 21, 2024 1:02 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…