ఈ శుక్రవారం విడుదలై నెగెటివ్ టాక్ తెచ్చుకున్న భారతీయుడు-2 సినిమాకు అతి పెద్ద సమస్య నిడివే అన్నది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న కంప్లైంట్. సన్నివేశాలు మరీ సాగతీతగా ఉన్నాయని.. శంకర్ సినిమాల్లో ఎప్పుడూ ఇంత సాగతీత లేదని.. సన్నివేశాలు ఇంతగా విసిగించలేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
ఐతే ఆ సాగతీత ఎందుకు వచ్చింది అన్నది ఇప్పుడు చర్చనీయాంశం. నిజానికి భారతీయుడు-2ను రెండు సినిమాలుగా తీసే ఉద్దేశం మొదట లేదు. ఒక సినిమాగానే మొదలుపెట్టారు. కానీ మధ్యలో రెండు పార్ట్స్ అయింది. ఇందుకు కథ విస్తృతి మాత్రమే కారణం అని భావించలేం.
ఈ సినిమా షూట్ క్రేన్ ప్రమాదం వల్ల మధ్యలో ఆగింది. రెండేళ్లు మళ్లీ సినిమా పునఃప్రారంభం కాలేదు. మామూలుగానే శంకర్ సినిమాలకు బడ్జెట్లు పెరుగుతాయి. ఈ బ్రేక్ వల్ల బడ్జెట్ మరింతగా తడిసి మోపెడైంది. ఈ క్రమంలోనే బడ్జెట్ వర్కవుట్ చేయడానికి 2 పార్ట్స్ ఆలోచన చేసినట్లున్నాడు శంకర్. దీంతో కథను విస్తరించడానికి చూశాడు. ఈ క్రమంలో ఇంటర్వెల్ పడాల్సిన చోట ఇండియన్-2ను ముగించాలని నిర్ణయించుకున్నాడు.
దీంతో అప్పటిదాకా ప్రథమార్ధం అనుకున్న దాన్ని పూర్తి సినిమా చేయడంతో అదనపు సీన్లు జోడించడంతో పాటు ఉన్న సన్నివేశాలను సాగదీశారన్నది స్పష్టం. దీని వల్ల ఆ సన్నివేశాల్లో బిగి పోయింది. భారతీయుడు-2 చూస్తే పెద్దగా కథ చెప్పిన ఫీలింగే కలగలేదు. అనవసర సీన్లు ప్రేక్షకులను విసిగించేశాయి. చాలా సీన్లలో డైలాగులు ఎక్కువైపోయాయి. షార్ప్‌నెస్ కొరవడింది. ఇదే ఇప్పడు సినిమాకు పెద్ద ప్రతిబంధకంగా మారింది.
అందరూ సినిమా ల్యాగ్ ల్యాగ్ అంటున్నారు. భారతీయుడు-3 ట్రైలర్ చూస్తే కొన్ని ఎగ్జైటింగ్ విషయాలున్నట్లే కనిపిస్తోంది కానీ.. పార్ట్-2 చూశాక దాని కోసం ప్రేక్షకులు ఏమాత్రం ఆసక్తి ప్రదర్శిస్తారన్నదే ప్రశ్నార్థకంగా మారింది. మొత్తంగా చూస్తే ఈ సినిమాను రెండు భాగాలుగా చేయాలన్న ఆలోచనే బెడిసికొట్టినట్లు అనిపిస్తోంది.
This post was last modified on July 15, 2024 5:54 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…